బీజేపీలోకి కేసీఆర్ అన్న కూతురు

తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తుంది. బండి సంజయ్ నాయకత్వంలో కమలం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. బండి సంజయ్ అగ్రసివ్ టాకింగ్ క్యాడర్ కి మంచి జోష్ ఇస్తుంది. మరోవైపు గత కొంత కాలంగా కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమంటూ బీజేపీ నేతలు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు పట్టాభిషేఖం చేయనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో కేటీఆర్ సీఎం పీఠం అధిరోహించనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చలు కూడా నడుపుతున్నారని సమాచారం.

ఇక ఇది ఇలా ఉంటే బీజేపీలో చేరే కొత్త నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీలో చేరుతున్నారు. యూత్ కూడా పెద్ద ఎత్తున బీజేపీవైపు మళ్లుతుంది. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. రోజుకో జిల్లాలో సమావేశం ఏర్పాటు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. 2023 అధికారం బీజేపీదే అని, టీఆర్ఎస్ ను ఇంటికి పంపడం ఖాయమని చెబుతున్నారు బండి సంజయ్, మరోవైపు ఫైర్ బ్రాండ్ లీడర్ రఘునందన్ రావు, ఎంపీ అరవింద్, సోయం బాపూరావులు అధికార పార్టీపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. అధికార పార్టీ భారీగా అవినీతికి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు కమలం నేతలు. అవినీతి లేని పాలన కావాలి అంటే బీజేపీతోనే సాధ్యమని ఘంటాపదంగా చెబుతున్నారు బీజేపీ నేతలు

ఇక ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ లో అసమ్మతి నేతలతో పాటు కేసీఆర్ పై గుర్రుగా ఉండి వివిధ పార్టీలలో ఉన్న వారిని కాషాయ గూటికి చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొద్దీ మందిని చేర్చుకున్నారు. ఇంకా చేర్చుకోవాల్సిన వారు చాలామంది ఉన్నారని సమాచారం. వీరిలో కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రమ్యరావు పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తిగా కాగానే ఆమె బీజేపీలోకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమెతో కొందరు బీజేపీ నేతలు టచ్ లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లానుంచి రెండు మూడు నెలల్లో బీజేపీలోకి భారీగా వలసలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. జేజమ్మ అరుణ అక్కడ ఉన్న కొద్దీ మంది నేతలతో చర్చలు జరుపుతున్నారు. జిల్లాలోని టీడీపీ నేతలతో కూడా జేజమ్మ టచ్ లో ఉన్నారట. ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది బీజేపీ. ఇక బడా నాయకులు ఎవరైనా వస్తే వారికి పార్టీలో పలు పదవులు కట్టబెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంట నేతలు.

కాగా ఇప్పుడు అందరి చూపు రమ్య రావు పైనే ఉంది. ఆమె పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే టికెట్ తోపాటు, ఆమె కుమారుడికి బీజేవైఎంలో ఏదైనా పదవి కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట కమలం నేతలు. మునిగిపోయ్యే కాంగ్రెస్ లో ఉంటే వచ్చేది ఏముండదని రమ్యకు బీజేపీ నేతలు చెబుతన్నారట. ఇక ఈమెను పార్టీలోకి తీసుకొచ్చేందుకు, రాములమ్మ లేదంటే జేజమ్మ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉండటంతో పార్టీ అధిష్టానం దానిపై దృష్టిపెట్టింది. టికెట్ ఎవరికి ఇస్తే విజయం సాధించగలం ఆమె విషయాలపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. గతంలో పోటీచేసిన నివేదితకు ఇవ్వాళా లేదంటే ఎవరైన కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలా అనే ఆలోచనలో ఉంది బీజేపీ. మరోవైపు జానారెడ్డి కుమారుడు జై వీర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదని తెలుస్తుంది. జానారెడ్డి అటువంటి ఆలోచనే లేదని చెప్పడంతో బీజేపీ నేతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.

బీజేపీలోకి కేసీఆర్ అన్న కూతురు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు