Rayalaseema Irrigation : 50 రోజుల్లోనే సీమ ప్రాజెక్టులు ఫుల్.. జగన్ యాక్షన్ ప్లాన్ పైనే.. కేసీఆర్ కు మండుతోందా..

    rayalaseema irrigation projects ys jagan master plan

    #Rayalaseema Irrigation : రాయలసీమ.. రాష్ట్ర విభజన సమయం నుంచి ఎన్నో సమస్యలు, వివాదాలను మూటగట్టుకున్నది. దీనికి కారణం సీమకు వచ్చే నీళ్లన్నీ తెలంగాణ రాష్ట్రం నుంచి రావటమే. ఇన్నాళ్లు ఏదో రకంగా ఉన్నా.. జగన్ సీఎం అయిన తర్వాత.. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంపై తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వానికి.. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అస్సలు నచ్చకపోగా.. మండిపోతున్నారు. ఎందుకంటే.. ఈ నీళ్లన్నీ ఎత్తిపోయాల్సింది శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి. ఇదే జరిగితే తెలంగాణలోని పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

    సీఎం జగన్ రాయలసీమకు నీళ్ల విషయంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం 50 రోజుల్లోనే అన్ని ప్రాజెక్టులను నింపే విధంగా ప్రణాళిక రచించటమే కాకుండా.. అందుకు సంబంధించి పనులు మొదలుపెట్టారు. వర్షాలు పడుతున్న సమయంలో.. వరదలు వచ్చిన సమయంలో.. కేవలం 50 అంటే 50 రోజుల్లో ప్రాజెక్టులు అన్నీ నిండిపోయే విధంగా కొత్త ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించారు.

    రాయలసీమలోని నీటి ప్రాజెక్టులు – వాటి సామర్థ్యం ఏంటో ఓ సారి చూద్దాం..

    1.  గోరకల్లు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 12.5 టీఎంసీలు అయితే ప్రస్తుతం నిల్వ చేస్తుంది 8 టీఎంసీలు మాత్రమే.
    2. గొల్లపల్లి రిజర్వాయర్ 1.9 టీఎంసీ అయితే.. ఒక్క టీఎంసీ మాత్రం నిల్వ.
    3. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ కెపాసిటీ ఐదు టీఎంసీలకు కేవలం 3.5 టీఎంసీలు మాత్రమే.
    4. చిత్రావతి రిజర్వాయర్ కెపాసిటీ 10 టీఎంసీలు అయితే.. 6.8 టీఎంసీలు మాత్రమే నిల్వ.
    5. గండికోట రిజర్వాయర్ 26.8 టీఎంసీలు అయితే.. కేవలం 12 టీఎంసీలు నిల్వ మాత్రమే.
    6. పెన్నా ఆహోబిలం 11 టీఎంసీ కెపాసిటీ అయితే.. నిల్వ చేస్తుంది 3.38 టీఎంసీలు మాత్రమే.
    7. బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ 17.9 టీఎంసీ సామర్థ్యం అయితే.. నిల్వ చేస్తున్నది 6.28 టీఎంసీలు.
    8. సరళాసాగర్ కెపాసిటీ 3 టీఎంసీలు అయితే ఒక్క టీఎంసీ మాత్రమే నింపుతున్నారు.
    9. పైడిపాలెం రిజర్వాయర్ 6 టీఎంసీలకు.. 5.5 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు

    దీనికి కారణం ఒకే ఒక్కటి. కాలువల సామర్థ్యం లేకపోవటం. గత రెండేళ్లలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏకంగా 10 లక్షల టీఎంసీలు నీళ్లు సముద్రం పాలు అయినా.. సీమలోని ప్రాజెక్టులు మాత్రం నిండలేదు. దీన్ని గుర్తించిన సీఎం జగన్.. ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న కాలువల సామర్థ్యాన్ని పెంచుతున్నారు.

    రాయలసీమలో పెరగనున్న కాలువల సామర్థ్యం ఇలా ఉంది :

    1. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేషన్ ను 44 క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచటం.
    2. తెలుగు గంగా కెనాల్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 18 వేల క్యూసెక్కులకు పెంపు.
    3. SRBC కెనాల్ సామర్థ్యం 21 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచటం.
    4. KC కెనాల్, నిప్పుల వాగు క్యారీయింగ్ కెపాసిటీని 12 వేల నుంచి ఏకంగా 35 వేల క్యూసెక్కులకు పెంచటం.
    5. అవుకు కెనాల్ సామర్థ్యం 30 వేలకు పెంచటం.
    6. గండికోట కెనాల్ సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంపు.
    7. HNL కెనాల్ సామర్థ్యం 2 వేల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచటం.
    8. తెలుగుగంగా మెయిన్ కెనాల్ 3 వేల నుంచి 8 వేల క్యూసెక్కులకు పెంపు.
    9. గండికోట సీబీఆర్ కెనాల్ సామర్థ్యాన్ని 4 వేలకు పెంపు.
    10. గండికోట జీఎన్ఎస్ మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని 4 నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంపు

    ప్రస్తుతం ఈ పనులు అన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. 2 వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఆల్ రెడీ ప్రారంభం అయ్యాయి. రాబోయే రెండేళ్లలో వీటిలో సగం అయినా పూర్తిగా పూర్తి చేయాలని ధృడంగా నిర్ణయించుకున్నారు సీఎం జగన్.

    ఇదే జరిగితే.. ఇన్నాళ్లు క్యారీయింగ్ కెపాసిటీ లేకపోవటం వల్ల శ్రీశైలం నుంచి వాడుకోవాల్సిన నీటిని సైతం వాడుకోలేకపోతున్న ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి నికర జలాల వాటా కింద.. రాయలసీమ లిఫ్ట్ నుంచి తన వాటా మొత్తం నీటిని రాయలసీమకు తరలించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది.

    మొదట్లో లైట్ తీసుకున్న సీఎం కేసీఆర్.. ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తోపాటు కాలువల సామర్థ్యం పనులు ప్రారంభం కావటంతో అలర్ట్ అయ్యారు. పోటీగా మేం కూడా ప్రాజెక్టులు కడతాం అంటున్నారు.

    ఇక్కడ విషయం ఏంటంటే.. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు సముద్రంలోకి వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకునే విధంగానే వీటిని డిజైన్ చేస్తున్నామని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. దిగువ రాష్ట్రం.. అందులోనూ సముద్రంలోకి వెళ్లే మంచినీటిని వాడుకుంటే తప్పేంటనేది సీఎం జగన్ వాదన..

    సీఎం కేసీఆర్ వాదన మరోలా ఉంది.. వరదలు లేనప్పుడు ప్రాజెక్టుల ఉన్నాయి కాబట్టి నికర జలాల వాటా పెంచాలనే డిమాండ్ వస్తుందని.. రాయలసీమలోకి అన్ని ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇదే వాదన ఏపీ తీసుకొస్తుందని.. అప్పుడు బాధపడేకంటే.. ముందే మేల్కొన్ని ఏపీ జలదోపిడీని అడ్డుకుంటున్నామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం.

    See also : రాయలసీమకు అన్యాయం జరగనివ్వం.. తెలంగాణ ప్రాజెక్టులపై కొట్లాట తప్పదు.. సీమ లిఫ్ట్ ఆపేది లేదు

    మీ అభిప్రాయం కామెంట్ చేయండి

    మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు