రేవంత్ రెడ్డి సారధ్యంలోనే 2023 ఎన్నికలు.. పీసీసీ చీఫ్ గా ఖరారు.. ఆమోద ముద్ర వేసిన సోనియాగాంధీ

revath reddy elected as tpcc cheif

Revanth Reddy as PCC Chief : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డికి సమాచారం వచ్చింది. అధికారింగా నోట్ రిలీజ్ చేయాల్సి ఉంది. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనక్కి తగ్గటం, రేవంత్ కు మద్దతుగా జీవన్ రెడ్డి, శ్రీథర్ బాబు సమర్థించటంతో ఎంపిక ఈజీ అయిపోయింది.

జూన్ 14వ తేదీనే కన్ఫామ్ అని వార్తలు వచ్చినా.. అధికారికంగా ముద్ర పడలేదు. జూన్ 18వ తేదీ సోనియా గాంధీ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేయనుంది.

2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పీసీసీ అధ్యక్ష ఎన్నికపై అందరి అభిప్రాయాలు తీసుకోవటం జరిగింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవటం, కరోనా ఉధృతి తగ్గి పొలిటికల్ యాక్టివిటీస్ పెరగటంతో ఈ నిర్ణయం తీసేసుకున్నారు. రాబోయే ఆరు నెలల్లో యూపీ, పంజాబ్ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన సమయం సైతం ఆసన్నకావటంతో.. తెలంగాణ అంశాన్ని తేల్చేసింది హైకమాండ్.

2023 ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని నిర్ణయించింది హైకమాండ్. అప్పటి వరకు మార్పులు లేవని సోనియా గాంధీ స్వయంగా చెప్పటం.. ఆ మేరకు హైకమాండ్ నుంచి హామీ వచ్చింది.

హైకమాండ్ నిర్ణయంతో.. 2023 అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారధ్యంలో ఎదుర్కోబోతున్నది. ఓ వైపు బీజేపీ ఊపులో ఉన్న క్రమంలో.. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ కు కొంచెం ప్లస్ కావొచ్చు. కాకపోతే అందర్నీ కలుపుకుని పోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో కష్టమైన టాస్క్. ఇంటిపోరును ఎలా అధిగమిస్తారు అనే అంశంలోనే రేవంత్ రెడ్డి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.

See also : చిత్తూరు – కేరళ – కర్ణాటక అడవుల్లో తిష్ట వేయడానికి ప్రయత్నించిన ISIS ఉగ్రవాద సంస్థ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు