షర్మిల వర్సెస్ ఎంపీ అరవింద్ – పాయింట్ పట్టేసిన లేడీ లీడర్

ఎవర్ని.. ఎక్కడ గోకకూడదో అక్కడే గోకితే ఏమవుతుంది.. మంట మండుతుంది. తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పుడిప్పుడే యాక్షన్ ప్లాన్ రచిస్తున్న వైఎస్ షర్మిల.. ఎవర్ని గెలకకూడదో వాళ్లకే గెలికింది.. ఇక మంట మండిద్దా.. ఎవరి నోరు గెలుస్తుంది.. ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో చూడాలి.

మార్చి 26వ తేదీ శుక్రవారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో హైదరాబాద్ లోటస్ పాండ్ లో మీటింగ్ పెట్టిన షర్మిల.. పసుపు రైతుల సమస్యలపై స్పందించారు. ఐదు రోజుల్లో బోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చినా.. బీజేపీ ఎంపీ అరవింద్ చేతులెత్తేశారని.. ప్రజలను వంచింది.. దగా చేసి.. మోసం చేసి గెలిచాడని వ్యాఖ్యలు చేసింది. పసుపు రైతులను మోసం చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు రైతులే తగిన గుణపాఠం చెబుతారని.. రాబోయే రోజుల్లో పసుపు రైతుల తరపున ఉద్యమం చేసి.. పసుపు బోర్డు సాధిస్తామని ప్రకటించారు.

ఎన్నికల ముందు వాగ్దానం చేసి.. గెలిచిన తర్వాత తెప్ప తగలేసి ఎంపీ అరవింద్ లాంటి నేతలకు బుద్ధి చెప్పాలంటూ నిజామాబాద్ కార్యకర్తలు, అభిమానులను కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు సాగుతామన్నారు షర్మిల. నిజామాబాద్ ఎంపీపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

ప్రతి ఒక్కరిపై నోరు పారేసుకునే ఎంపీ అరవింద్.. షర్మిల్ లేవనెత్తిన పసుపు బోర్డు ఇష్యూపై స్పందిస్తారా.. స్పందిస్తే దానికి షర్మిల పార్టీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. షర్మిలను ఏ విధంగా ఆడుకుంటాడు ఎంపీ అరవింద్.. ఏ విధంగా విరుచుకుపడతాడు అనేది చూడాలి. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ.. తెలంగాణలో ఆంధ్ర పార్టీ అనటానికి బీజేపీకి ఛాన్స్ లేదు.. సో.. ప్రాంతీయ వాదం కంటే.. ఇక్కడ పసుపు బోర్డు అనేది కీ పాయింట్.. దీనిపైనా స్పందించాల్సి ఉంటుంది అరవింద్ అంటున్నారు.

షర్మిల వర్సెస్ ఎంపీ అరవింద్ – పాయింట్ పట్టేసిన లేడీ లీడర్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు