ఇది గమనించారా : అభివృద్ధి చెందిన దేశాల్లో క్రికెట్ ఆట లేదు

no cricket in developed countries

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో క్రికెట్ ఎంత ఫేమస్సో మనకి తెలియనిది కాదు. ఇండియా, పాకిస్థాన్ , శ్రీలంక, బంగ్లాదేశ్ , ఆఫ్రికా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో ఈ క్రీడకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ దేశాల్లో ఈ ఆట మీద వందల కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఒక్క సారి క్రికెట్ మ్యాచ్ జరిగితే తక్కువలో తక్కువ 10 కోట్ల మంది ఈ ఆటను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చూస్తారు. ఇక ఫేవరెట్ మ్యాచ్ లైతే ఆ సంఖ్య గురించి చెప్పాల్సిన పని లేదు.

ఇక అమెరికా, జపాన్, కెనడా, రష్యా, చైనా, సింగపూర్ వంటి దేశాల్లో క్రికెట్ అనే మాట అంతగా వినపడదు. వేలల్లో ఏ ఒక్కరికో ఇద్దరికో క్రికెట్ అంటే అభిమానం ఉంటుంది తప్ప , ఈ దేశల్లో ప్రజల్లో క్రికెట్ అంటే పిచ్చెక్కిపోవడం, గంటలతరబడి టీవీలకు అతుక్కుపోవడం ఉండదు. ఇక్కడ నగరాలు , పట్టణాలు అద్భుతంగా అత్యాధినికంగా ఉన్నప్పటికి , క్రికెట్ స్టేడియాలు అసలు కనిపించవు ఒక వేళ ఉన్నా అతి సాధారణంగా ఉంటాయి.

ఇది గమనించారా : అభివృద్ధి చెందిన ఆ దేశాల్లో క్రికెట్ ఆట లేదు

మొత్తానికి ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది ఏంటి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్రికెట్ అనే పేరు పెద్దగా వినపడటం లేదు. క్రికెట్ నుండి కోట్లాది రూపాయల సంపాదన ఉన్నప్పటికి ఆ దేశాలో క్రికెట్ వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బహుశా క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులు అందులోని పెద్దలకి లాభం ఉంటుందే తప్ప సాధారణ ప్రజలకి కాదు అనే విషయం వారికి స్పష్టంగా తెలుసుకాబట్టి క్రికెట్ ని ఎంకరేజ్ చేయడం లేదేమో. ఒక టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు జరుగుతుంది, ఒక వన్డే మ్యాచ్ ఒక రోజు జరుగుతుంది అంటే తక్కువలో తక్కువ టేస్ట్ మ్యాచ్ కి 30 – 40 గంటలు, వన్డే మ్యాచ్ కి 8 – 10 గంటల సమయం అవసరం అవుతుంది.

కొన్ని కోట్ల మంది ఇన్ని గంటలపాటు ఆటను చూస్తూ కూర్చుంటే వారి పనిగంటలు వేస్ట్ అవుతాయి. బహుశా తమ దేశ ప్రజలకు ఈ గంటలు మొత్తం సేవ్ అవ్వాలని ఆ దేశాలు కోరుకుంటున్నాయోమో. ఏదేమైనా ఇదంతా హాస్యాస్పదంగా ఉన్నప్పటికి… అభివృద్ధి చెందిన దేశాల్లో క్రికెట్ లేదు అనేది మాత్రం వాస్తవం. ఈ ఆటకు ఎక్కువ గంటల అవసరంతో పాటు, మెయింటెనెన్స్ అధికం కాబట్టి దీన్ని ఓలింపిక్స్ లో సైతం ఈ ఆటను పెట్టలేదనేది కూడా వాస్తవం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు