ఓడి గెలిచాడు : ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన నత్తొడి కథ !

joe biden stammer

అతనికి చిన్నప్పుడు చాలా అంటే చాలా నత్తి, మాట్లాటం కూడా సరిగ్గా వచ్చేది కాదు. కాని ఇప్పుడు అతని ప్రపంచాని శాసించే స్థాయి ఉన్న ఒక దేశాధినేత. ఎన్నికల్లో అధికారికంగా గెలిచినప్పటికి పదివి బాధ్యతలు చేపట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నత్తి కారణంగా చదువు చెప్పే టీచర్లు నీవల్ల కాదు నువు ఏం చేయలేవు అంటే నేను, అమెరికా ప్రెసిడెంట్ అవుతా అని చెప్పిన ఆ నత్తి అబ్బాయి ఎవరో కాదు, అమెరికాకు 46వ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ ( Joe Biden ).

చిన్నతనం నుండి నత్తితో ఎన్ని ఇబ్బందులు పడినా, స్నేహితులు- తోటి పిల్లలు ఎగతాళి చేసిన బైడెన్ ఏ మాత్రం బాధపడలేదు. మాటలతో పెద్దగా అవసరంలేని ఆటలపై ఎక్కువగా ధ్యాస పెట్ట్ అందులో రాణించాడు. ఆటల్లో అతని ప్రతిభను చూసినవారు మా టీమ్ లో ఉండాలి అంటే మా టీమ్ లో ఉండాలని కోరుకునే వారు.

చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడిన జో బైడెన్ 31 ఏళ్ల వయస్సు అతి చిన్న వయస్సు ఉన్న సెనేటర్ గా ఎన్నికయ్యాడు.ఇక అక్కడ నుంచి వరుసగా 6 సార్లు సెనేటర్ గా ఎన్నికవడమే కాక యూఎస్ చరిత్రలోనే అత్యధికంగా 18సంవత్సరాల పాటు సెనేటర్ గా ఉన్న ఏకైక వ్యక్తి జో బైడెన్.

సెనేటర్ స్థాయి ఉన్నత స్థాయికి ఎదిగిన బైడెన్, ఓబాగా హయాంలో వైస్. ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. అనంతరం 2020లో జరిగిన ఎన్నికల్లో , యు.ఎస్ చరిత్రలోనే అధిక ఓట్లు 77,920,048 సాధించిన ఏకైకా అధ్యక్షునిగా నిలిచారు. అంతే కాదు 77 ఏళ్ల వయస్సులో అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి అమెరికా చరిత్రలో అత్యంత కురువృద్ధుడిగా నిలిచాడు బైడెన్.

చిన్నతంలో తనను ఎగతాళి చేసిన టీచర్లతో చేసిన సవాలును సాధించి చూపి, అమెరిగా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ తన నత్తిని లోపంగా పరిగణించకుండా, వచ్చిన ప్రతి సవాలును ఎదుర్కోని ఈ స్థాయికి వెళ్లాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు