జగన్ తిరుపతి ప్రచారం వెనక వాళ్ల మాటలే కారణమా?

అన్న తిరుపతి వస్తున్నాడు.. ప్రచారానికి సీఎం జగన్.. షాక్ అయిన నేతలు.. కారణాలు ఇదే..

అన్న అవసరం లేదు.. అన్న కటౌట్ ఉంటే చాలు.. బంపర్ మెజార్టీతో గెలుస్తాం అంటూ చెప్పుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. సీఎం జగన్ నిర్ణయంతో షాక్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగటానికి కారణం ఏంటో తెలుసా.. వాళ్లు మాట్లాడిన మాటలే అంటున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించిన సీఎం జగన్.. ఆ తర్వాత సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత.. నాలుగు రోజులు పార్టీ వ్యవహారంలపై అక్కడి నేతలు అందరికతో మాట్లాడారంట. నాలుగు రోజులు మాట్లాడిన సీఎం జగన్ కు.. ఒకే ఒక్క మాట అందరి నోటి నుంచి నాలుగు రోజులు వినిపించింది అంట.. ఆ మాట ఏంటో తెలుసా.. కచ్చితంగా గెలుస్తాం.. మెజార్టీ 4, 5 లక్షలు వస్తుంది.. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని స్పష్టంగా చెప్పారంట. ఇదే సమయంలో ఎక్కడైనా మైనస్ ఉందా.. ఇబ్బందులు ఉన్నాయా.. బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రచారం గురించి ఆరా తీశారంట.

ప్రత్యర్థుల ప్రచారాన్ని చాలా లైట్ గా కొట్టిపారేశారంట తిరుపతి ప్రచారంలోని నేతలు. ఎవరూ కూడా పార్టీ నుంచి మైనస్ విషయాలు చెప్పలేదంట. ఎంత తురుంఖాన్ పార్టీ అయినా.. కొమ్ములు తిరిగిన నేతలు ప్రచారంలో ఉన్నా.. మైనస్ పాయింట్లు లేకుండా ఉంటుందా ఏంటీ.. ఒకటీ అరా ఉన్నా ఓపెన్ గా చెప్పండి అన్నారంట జగన్.

నాలుగు రోజులు మాట్లాడిన నేతలు ఎవరూ కూడా ఒక్క మైనస్ పాయింట్ చెప్పలేదంట. ఈ లెక్కన అభ్యర్థులు అందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు.. ఎలాగైనా గెలుస్తామనే ధీమాలో ఉన్నారు.. మెజార్టీపై దృష్టి పెట్టటం లేదు.. కావాల్సింది గెలుపు కాదు.. మెజార్టీ.. ఈ పాయింట్ పై ఒక్క మైనస్ పాయింట్ నేతల నుంచి రాకపోవటంతో.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది.. అందరూ ఒకే మాట.. ఒకే విధానం.. ఒకే రకంగా ఆలోచిస్తున్నారు.. ఇది మంచి పద్దతి కాదు అని డిసైడ్ అయ్యారంట సీఎం జగన్.

ఎవరూ ఊహించని విధంగా తిరుపతి ప్రచారంలోకి వస్తున్నాను అంటూ ఐదో రోజుల నేతలకు చెప్పారంట. అందరూ అవాక్కయ్యారంట. ఇవే మాటలు చంద్రబాబుకు చెప్పి ఉంటే.. చప్పట్లు కొట్టేవారని.. అదే మా జగన్ చూడండి.. ఏకంగా రంగంలోకి దిగారు.. నెగిటివ్ పాయింట్లు చెప్పకపోయే సరికి రంగంలోకి దిగుతున్నారు అంటున్నారు వైసీపీ లీడర్స్.. అన్న తిరుపతి వస్తున్నాడు అని తెలియగానే.. జనంలోనూ హుషారు పెరిగింది.. జోష్ వచ్చింది అంటున్నారు. మెజార్టీపై ధీమా వ్యక్తం అవుతుంది.. ఏమైనా లీడర్ ఈజ్ లీడర్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు