టీడీపీలో ఈ ముగ్గురు రహస్య మంతనాలు – ఆ తర్వాతే ఆ నిర్ణయం?

టీడీపీలో ఈ ముగ్గురు రహస్య మంతనాలు - ఆ తర్వాతే ఆ నిర్ణయం?

తెలుగుదేశం పార్టీలో ఆ ముగ్గురి రహస్య మంతనాలు పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ఏప్రిల్ 6వ తేదీ రాత్రి హైదరాబాద్ లో.. గంటపాటు జరిగిన ఈ సమావేశం పార్టీలో అంతర్గత చర్చకు దారి తీసింది. ఈ మంతనాలు చేసింది ఎవరో తెలుసా.. అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ .

జెడ్పీ ఎన్నికలపై హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు రానున్న క్రమంలో.. పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహంపై ఈ ముగ్గురు చర్చించుకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. ఆ విషయాన్ని వెంటనే ప్రకటించాలని నిర్ణయించారంట.

ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఆ వెంటనే వర్ల రామయ్య వెంటనే ప్రెస్ మీట్ పెట్టి.. జెడ్పీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళుతున్నట్లు ప్రకటించటం చకచకా జరిగిపోయాయి. ఆ ముగ్గురి రహస్య మంతనాల్లో ఈ విషయాన్నే చర్చించారని.. వర్ల రామయ్య ప్రకటన తర్వాత క్లారిటీ వచ్చింది అంటున్నారు టీడీపీ నేతలు.

ఎన్నికల బహిష్కరణ, పార్టీ బలోపేతంపై ఇలాంటి రహస్య మంతనాలు జరిగితే బాగుండేది.. అలా కాకుండా కోర్టుల ద్వారా పోరాటానికి ఎందుకీ చర్చలు అంటున్నారు కార్యకర్తలు, అభిమానులు. ఇప్పటికైనా పార్టీ కార్యకర్తలు, నేతలతో బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది.. ఇంకా ఎన్నాళ్లు కోర్టులు, కేసులు అంటూ పార్టీని కోర్టుల్లో బలోపేతం చేస్తారు.. ఓటు వేసి జనంలో కదా బలం ఉండాల్సింది అంటున్నారు.

కనీసం నాలుగు ఊర్లు కాదు.. నలుగురితో ఓటు వేయించలేని యనమల, నిమ్మగడ్డతో ఎందుకయ్యా ఈ రహస్య మంతనాలు.. అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ కు.. మళ్లీ రహస్య మంతనాలు అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు