ఎక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్మి స్టూడియోలు కట్టింది చాలు : ఇక రేట్లు తగ్గించండి జగన్ అల్టీమేటం

ఎక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్మి స్టూడియోలు కట్టింది చాలు : ఇక రేట్లు తగ్గించండి జగన్ అల్టీమేటం

ఎక్కడో ఒకటి అరా తప్ప సినిమా థియేటర్లు మొత్తం సినిమా నిర్మాతలు, హీరోలకు చెందిన ఉంటాయో. ఈ థియేటర్లలో టిక్కెట్లను తమ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముతారు. పెద్ద స్టార్ హీరో సినిమా అయితే 500, 1000 అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టిక్కెట్లను ఇష్టం వచ్చినట్టు పెంచి అమ్ముకుని కోట్లు సంపాదించి, స్టూడియోలు కడుతుంటే సామాన్యుడు  మాత్రం తన కుటుంబాన్ని తీసుకుని సినిమాకు వెళ్లాలంటే తన రెండు-మూడు రోజుల జీతాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు ఊరట ఇస్తూ జగన్ ప్రభుత్వం అల్టీమేటం జారిచేసింది.

ఇప్పుడు పవన్ కల్యాణ్ పుణ్యమా అని అన్ని రేట్లు తగ్గిపోయాయి.. అందరూ తప్పని సరిగా తగ్గిన ధరల బోర్డు పెడుతున్నారు.. గతంలో ఎప్పుడూ చూడని.. వినని విధంగా సినిమా టికెట్ రేట్లు తగ్గిపోయాయి.. గతంలో ఉన్న రేట్లను సైతం సవరించారు అంటున్నారు సినీ అభిమానులు.

గతంలో కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. వారం, 10 రోజుల వరకు టికెట్ ధర 50 నుంచి 100 శాతం అధికంగా అమ్మేవారు. అంటే 100 రూపాయల టికెట్ ను.. అధికారికంగానే.. ధియేటర్ టికెట్ కౌంటర్ లోనే 200 రూపాయలకు అమ్మేవారు. ఇది కొన్నేళ్లుగా జరుగుతూ వచ్చింది. వకీల్ సాబ్ మూవీ విషయంలో ప్రభుత్వం ఆదేశాలతో అన్ని సినిమా ధియేటర్ల దగ్గర బోర్డులు పెడుతున్నారు.

టికెట్ రేట్లను బహిరంగంగా ప్లకార్డులతో అంటిస్తున్నారు. జీవో నెంబర్ 35ను అనుసరించి.. నేటి నుంచి అనగా ఏప్రిల్ 11వ ేతదీ నుంచి అన్ని తరగతుల టికెట్ రేట్లను ఈ కింది విధంగా సవరించటడమైనది.. 100, 80, 40 రూపాయలుగా నిర్ణయించారు. దయచేసి ప్రేక్షకులు అందరూ గమనించగలరు అంటూ ధియేటర్ల ముందు బోర్డులు పెట్టారు.

టికెట్ కౌంటర్ ఎదుట పెద్ద అక్షరాలతో టికెట్ ధరను ముద్రించిన కాగితాలు అంటించారు. గతంలో ధియేటర్ ఇష్టానుసారం దోచుకునే వారు.. ఎంత ధర చెబితే అంటే.. సినిమా ధియేటర్లలో కొత్త మార్పును చూసి ప్రేక్షకులు సైతం అవాక్కవుతున్నారు. గతంలో ఎప్పుడూ చూడలేదని.. ఈ విధానం చాలా బాగుందని అంటున్నారు. ప్రతి సినిమా విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక నుంచి ఏపీలో విడుదల అయ్యే ప్రతి సినిమా.. అది ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రాంచరణ్.. ట్రిబుల్ ఆర్ మూవీ అయినా సరే.. మొదటి రెండు రోజులు మాత్రమే అధిక ధరలకు విక్రయించాలి.. మూడో రోజు నుంచి నార్మల్ రేట్లకు మాత్రమే అమ్మాలి.

వకీల్ సాబ్ సినిమా విషయంతో  సినిమా ధియేటర్లలో దోపిడీ ఎంత జరుగుతుందో బహిరంగంగా తెలిసిపోయింది జనానికి. అలాగే ధరలను పెంచుకోండి అనే చెప్పే ప్రభుత్వాలను గతంలో చూశాం కాని టిక్కెట్ల ధరలపై కోర్టుకు వెళ్లి తగ్గించాల్సిందే అని పట్టుబట్టిన ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచింది.

See also : రోశయ్యతో దుర్మార్గంగా వ్యవహరించిన రామోజీరావు : తెలుగు పత్రిక తీరు అప్పుడు-ఇప్పుడు

See also : జగన్ – బీజేపీ కలిసి పవన్ కల్యాణ్ ను లేపుతున్నారు : తిరుపతి ఎన్నికలో కొత్త వ్యూహం – జనసేనకు ప్లస్ అవుతుందా?

See also : పెద్ద నిర్మాతలకు షాక్ : ఎన్టీఆర్, చెర్రీ, ప్రభాస్, మహేష్.. వీళ్ల సినిమాలకు ఇవే టికెట్ రేట్లు పెడతారా ?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు