అభ్యర్థులకు ప్రచార సమయం ఇవ్వకూడదూ – GHMC లో టీఆర్ఎస్ వ్యూహం ఇదే

trs party logo

GHMC ఎన్నికలను డిసెంబర్ 6 న నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జనవరి నెలలో ఎన్నికలు ఉండవచ్చని అందరూ భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం డిసెంబర్ లోనే ఎన్నికలు ముంగించడం వెనుక ఒక వ్యూహం ఉందని తెలుస్తుంది.

దుబ్బాక దెబ్బకు ముందు జాగ్రత్తలో TRS

దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలో TRS ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంతో పాటు, సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కు వ్యతిరేఖత రావడంతో ఓటమి పాలైంది. ఇదే సీన్ GHMC ఎన్నికల్లొ రిపీట్ కాకూడదే ఉద్దేశంతోనే TRS ప్రచారానికి సమయం లేకుండా ఎన్నికలు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఒకవేళ ప్రచారానికి సమయం దొరికితే బీజేపీ సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకోని వ్యతిరేఖ ప్రచారం చేస్తారనే భయం TRS వర్గంలో ఉంది.దీనికి తోడు గత నెలలో వచ్చిన వరదలు హైదరాబాద్ ను అల్లకల్లోలం చేశాయి. ఇదే విషయం ప్రతి పక్షాలకు ప్రచారాస్త్రంగా మారుతుందనే ఆలోచనతో సీఎం కేసీఆర్ స్వయంగా ఎన్నికలను ముందుకు జరిపినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది.

అభ్యర్థులకు ప్రచార సమయం ఇవ్వకూడదు

ఒక్క TRS మినాహా మరే ఇతర పార్టీల అభ్యర్థులు GHMC ఎన్నికల విషయంలో పూర్తి సన్నద్దతలో లేరు. ఎన్నికల నోటీఫికేషన్ నుండి ఎన్నికల తేది వరకు కేవలం 20 రోజులు కూడా లేని నేపథ్యంలో , పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేయడానికే చాలా సమయం కావాలి.

ఇక అభ్యర్థి ఫైనల్ అయిన తరువాత నామినేషన్ వేసే హాడవుడితోనే అంతా అయిపోతుంది. సో ప్రచారానికి పెద్దగా సమయం దొరకదు. ఈ గ్యాప్ లో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న పొలిటికల్ , సోషల్ , గ్రౌండ్ లెవల్ టీమ్స్ సాయంతో ప్రచారాన్ని నిర్వహించాలని TRS భావిస్తుంది.

ఇతర పార్టీలకు ఇప్పటి వరకు కేవలం 30 – 60 స్థానాల్లో మాత్రమే పోటి ఇవ్వగల సత్తా ఉన్న అభ్యర్థులు ఉన్నారు. అంటే గెలవడానికి కావాల్సినన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా సరిగ్గా లేరనిమాట. ఇక నమ్మకంగా గెలుస్తున్నారు అనుకున్న అభ్యర్థులైతే కాంగ్రేస్ , బీజేపీలకు కనీసం 10 మంది కూడా లేరు. ఇలాంటి సమయంలో ఈ పార్టీలు అభ్యర్థుల బలంపై కాక , TRS ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేఖత మీదనే ఆధారపడాలి.

ఇక అధికారం చేతిలో ఉంది కాబట్టి TRS ప్రభుత్వం ఇప్పటికే కార్మికులకు, పేదలకు అనేక వరాలు ప్రకటించి లైన్ లో పెట్టింది. ఇంటి పన్నుల్లో సబ్సీడి ఇచ్చో లేక మరొక పథకం ప్రకటించో ప్రజల్ని కూడా లైన్ లో పెడితే గెలుపు పక్కా. ఏం జరుగుతుందో ప్రతిపక్షాలు తెలుసుకునే లోపులో TRS తన పింక్ జెండాను GHMC లో ఎగరేస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు