వకీల్ సాబ్ మూవీ రివ్యూ – పవన్ నటన అద్బుతం

వకీల్ సాబ్ మూవీ రివ్యూ - పవన్ నటన అద్బుతం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మూవీ ధియేటర్లలో సందడి చేస్తుంది. హిందీలో పింక్ మూవీ రీమేక్ అయినా.. తెలుగు నేటివిటీకి, పవన్ నటనకు తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేశారు. మూవీలో హైలెట్ ఏంటంటే.. పవన్ నటన. ఇంత వరకు పవన్ సినిమాలకు.. వకీల్ సాబ్ మూవీకి చాలా తేడా కనిపించింది. నటనలో మరో ఎత్తుకు వెళ్లాడు పవన్ కల్యాణ్. చాలా డీసెంట్ గా నటించాడని.. ఎప్పుడూ చూడని పవన్ ను ఈ సినిమాలో చూశామని చెబుతున్నారు ఫ్యాన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ నటన అద్బుతం అంటున్నారు.

పింక్ సినిమాలో కోర్టు సీన్స్ హైలెట్. వకీల్ సాబ్ మూవీలోనూ అదే రిపీట్ అయ్యింది. వకీల్ సాబ్‌గా పవన్ తనదైన శైలిలో కనిపించారు. సినిమాలో నటించారు అనేకంటే.. జీవించాడు అనొచ్చు అంటున్నారు ఫ్యాన్స్. పవర్ స్టార్ కెరీర్‌లోనే బెస్ట్ అనే టాక్ వినిపిస్తుంది. కోర్టు రూమ్ సీన్లలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గ్రాండ్‌గా ఉంది.

కోర్టు సీన్లలో పవన్ దుమ్మురేపాడని.. ఫైట్స్ మరో లెవెల్‌లో ఉన్నాయని.. వేణు శ్రీరాం సినిమా కథను అద్భుతంగా తెరకెక్కించాడని. థమన్ మ్యూజిక్, బీజీఎం అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

కొన్ని సంవత్సరాలుగా పవన్ కల్యాణ్‌ను ఎంత మిస్ అయ్యామో అనే విషయం వకీల్ సాబ్ చూస్తే తెలుస్తుందని.. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా కమర్షియల్ ఎలిమింట్స్ చొప్పించిన విధానం బాగుందని ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసిన వారి మాట.

మూవీ ఫస్టాప్ యావరేజ్ గా సాగిపోతే.. సెకండాఫ్ లో వచ్చే కోర్టు సీన్లతో మూవీ పీక్ లోకి వెళుతుందని.. సింగిల్ లైన్ డైలాగ్స్.. పవన్ మేనరిజమ్స్, యాటిట్యూడ్ బాగా కుదిరాయి అంటున్నారు ఫ్యాన్స్. పవన్ ఫ్యాన్స్ కు తగ్గట్టుగా మూవీ సాగుతుందని.. వాళ్లు బిర్యానీ పెట్టినట్లే అంటున్నారు. ఫస్టాప్ కంటే సెకండాఫ్ చాలా బెటర్ అంటున్నారు మరికొందరు.

వకీల్ సాబ్ మూవీని ఒక్కమాటలో చెప్పాలంటే.. పవన్ కల్యాణ్ నటన అద్బుతం అని మాత్రం చెప్పగలం.. ఇది పక్కా ఫ్యాన్స్ మూవీనే అయినా.. ఫ్యామిలీతో చూడదగిన విధంగా ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు