ఆగిపోయిన వెబ్ సిరీస్ షూటింగ్స్ – లక్ష కోట్లు నష్టం – ఓటీటీ అంటే క్రియేటివిటీకి బాప్

నిమాల కోసం ఓటీటీలు పుట్టలేదు. వాటి కోసం థియేటర్లు, టీవీలు ఉన్నాయి. మన దేశం ఆలోచన మాత్రం ఓటీటీ అంటే సినిమాల కోసం అనే భ్రమలో ఉంది. ఓటీటీ అంటేనే ఓవర్ ది టాప్.. క్రియేటివిటీవీకి బాప్ అని అర్థం.. అందులో అన్నీ ఓవర్ గానే ఉంటాయి..

డిజిటల్ మీడియా కంటెంట్.. ముఖ్యంగా ఓటీటీలను కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకెళ్లనున్నట్లు ఆదేశాలు వచ్చిన మరుక్షణం.. దేశ వ్యాప్తంగా వెబ్ సిరీస్ షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో.. ఇది బిగ్ షాక్ అంటున్నాయి ఓటీటీ సంస్థలు. కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలిసిన తర్వాత.. కంటెంట్ మార్చుకుని మళ్లీ రీ షూట్ చేసుకోవాల్సి ఉంటుంది.. అప్పటి వరకు షూటింగ్స్ అన్ని నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించారు. దీని వల్ల దేశంలో లక్ష కోట్ల నష్టం అని అంచనా వేస్తున్నారు నిర్మాతలు, ఓటీటీ ఇండస్ట్రీ.

ఓటీటీ అంటేనే.. ఓవర్ ది టాప్.. సినిమాల్లో చూపించలేనిది.. సెన్సార్ షిఫ్ అవసరం లేకుండా తీసుకొచ్చిన డిజిటల్ ప్లాట్ ఫాం. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ఎంతో పాపులర్ అయ్యింది. ఓటీటీ అంటేనే సెన్సార్ లేనిది.. దీనికి సెన్సార్ అంటే.. ఇక సినిమాకు – వెబ్ సిరీస్ కు తేడా ఏంటీ అంటున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశంలోనూ ఓటీటీలకు సెన్సార్ లేదు.. ప్రభుత్వ నియంత్రణలో లేదు.

ఓటీటీకి ఆద్యులు నెట్ ఫ్లిక్స్.. కొంచెం ఎక్కువగా క్రైం, థ్రిల్లర్, నగ్నత్వం, రొమాంటిక్ ఉంటాయి. థియేటర్లలో వేయలేనివి.. నలుగురిలో కూర్చుని చూడలేనిది.. కపుల్స్ తోపాటు భార్యభర్తలతో చూడదగిని కంపెంట్ ఇది. అలాంటి ప్లాట్ ఫాంను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకెళితే.. ఇంకెక్కడి విదేశీ సంస్థలు..

ఓటీటీ అంటే సినిమాల కోసం తీసుకొచ్చిందన్న పిచ్చి ఆలోచన, తుగ్లక్ ఐడియాలో ఉంది తెలుగు సినీ ఇండస్ట్రీతోపాటు దేశంలోని కొంత మంది ప్రేక్షకులు. ఓటీటీ అనేది వెబ్ సిరీస్ కోసం పుట్టుకొచ్చింది.. కాకపోతే సినిమా కంటెంట్ కూడా ఇస్తున్నారు. కేవలం సినిమాల కోసం ఓటీటీలు పుట్టలేదు. వాటి కోసం థియేటర్లు, టీవీలు ఉన్నాయి. మన దేశం ఆలోచన మాత్రం ఓటీటీ అంటే సినిమాల కోసం అనే భ్రమలో ఉంది. ఓటీటీ అంటేనే ఓవర్ ది టాప్.. క్రియేటివిటీవీకి బాప్ అని అర్థం.. అందులో అన్నీ ఓవర్ గానే ఉంటాయి.. అందుకే ఓవర్ ది టాప్ అన్నారు.. ఇప్పుడు ఓటీటీలకు సెన్సార్ అంటే.. దేశంలో దానిపై ఆధారపడి పెట్టిన.. పెడుతున్న.. పెట్టబోతున్న లక్ష కోట్ల వ్యాపారం మటాష్..

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు