వంట మాస్టర్లు ఉప్పు,కారం వంటి వాటిని ఎత్తు నుండి ఎందుకు వేస్తారో తెలుసా – దీని మీద పరిశోధన కూడా చేశారట

cooking in different styles makes more tasteir

మనం ఇంట్లో వంటలు వండుకునేప్పుడు కూరల్లో ఉప్పు, కారం లేదా మసాల దినుసులను చాలా నీట్ గా ఒక స్పూన్ తో లెక్క చూసుకోని వేస్తాం. ఇలా ఒకేసారి ఉప్పు,కారం లేదా మసాలా దినుసులను వేసి అవి కూరలో కలిసే విధంగా  ఒక పెద్ద గరిటెతో చక్కగా తిప్పుతాం. కాని హోటళ్లలో పనిచేసే చెఫ్ లైనా , మనం ఫ్రైడ్ రైస్ ,పానీ పూరి తినే బండ్లపై వంటలు చేసే వంట మాస్టర్లు ఉప్పు , కారం లేదా మసాలా దినుసులతో చేత్తోనే వేస్తారు. అది కూడా చాలా వేగంగా కొద్దిగా ఎత్తునుండి ఆహారం పై చల్లుతారు. ఇలా ఎందుకు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. బహుశా పెద్దగా ఆలోచించి ఉండక పోవచ్చు. కాని ఈ అంశపై రిసెర్చ్ చేసిన పరిశోధకులు మనం ఆహారం పై మసాలా దినుసులను ఎంత ఎత్తు నుండి చల్లుతున్నాం అనే దానిపై ఆహారం రుచి ఆధారపడి ఉంటుందని తేల్చారు. ఈ కారణంగా వంటమాస్టర్లు లేదా చెఫ్ లో దినుసులను ఒకే దగ్గర వేయకుండా కొద్ది ఎత్తునుండి ఉడుకుతున్న ఆహారం పై చల్లుతారట.

కారణం ఇది ఎత్తుమీద ఆధారపడే రుచి

చెంచాలతో మనం దినుసులను చల్లినప్పుడు అవి ఒకే దగ్గర పడి ఆహారం మొత్తంలో సరిగ్గా కలవకుండా ఉండిపోతాయని, అదే  ఎత్తు నుండి చల్లినప్పుడు ఆహారం మొత్తం పరుచుకోవడమే కాక, ఉడుకుతున్న ఆహారంలో కలిసిపోయి మంచి రుచిని ఇస్తాయని తేల్చారు. 4 అంగుళాల ఎత్తు నుండి వేసినప్పుడు ఒక రకమైన రుచి, 8 అంగుళాల ఎత్తునుండి వేసినప్పుడు ఒక రుచి, 12 అంగుళాల నుండి వేసినప్పుడు ఒక రుచి ఆహారానికి వస్తుందని తేల్చారు.

మరోక కారణం ఆకట్టుకోవడం

ఇక ఆహారాన్ని వండేప్పుడు తమదైన శైలిని ప్రదర్శించడానికి కూడా చెఫ్ లు ఈ విధంగా చేస్తారని వెల్లడించారు. ఒక ప్రత్యేక విధానంలో గిన్నెలను తిప్పడం, చపాతీలు పైకి విసిరి కరెక్ట్ గా పాన్ పై పడేట్టు చేయడం, ఎత్తు నుండి కప్పులో టి కలపడం, వెరైటి పద్ధతిలో ఐస్ క్రీమ్ సర్వ్ చేయడం లాంటివి ఈ కూడా ప్రజలను ఆకట్టుకోవడానికేనని వారు వెల్లడించారు. ఆహారం తయారు చేసే పధ్దతి ప్రజలకు నచ్చితే ప్రజలు సైకలాజికల్ గా రుచి కూడా బాగున్నట్టుగా భావిస్తారని తేలింది.

హోటళ్లు, పానీపూరి బండ్లు, ఫ్రైడ్ రైస్ సెంటర్ల వాళ్లకైతే ప్రజలు ఆకర్షించాలి కాబట్టి ఏదో ఒకరకంగా తిప్పలు పడక తప్పదు.. కాని ఇంట్లో, వండే వాళ్లదే రాజ్యం.. వాళ్లు వండిపెట్టినదే తినాలి అందులోని ఇంట్లో మనకి వండి పెడుతున్న మోడర్నన్ లేడిస్ వండిపెట్టడమే ఎక్కువ అనుకుంటున్నారు కాబట్టి పెట్టింది తిని మనపని మనం చూసుకొవడమే.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు