ఆమంచి కృష్ణమోహన్ కు సీఎం జగన్ వార్నింగ్.. బలరాంకే మద్దతు పలికిన అధిష్టానం.. ఆమంచి రూటు ఎటు

ys jagan support karanam balaram

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిరాకు తెప్పిస్తున్నాయి. జిల్లాలో పార్టీకి ఆధిపత్యం ఉన్నా.. రెబెల్స్ బెడద ఎక్కువగా ఉండడాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుంది. ముఖ్యంగా చీరాల నియోజకవర్గం విషయంలో పంచాయతీ సీఎం జగన్ వరకు వెళ్లింది.

చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం.. ఏడాది క్రితం సీఎం జగన్ ను కలిసి అధికార పార్టీకి మద్దతు పలికారు. అదే విధంగా కుమారుడు వెంకటేష్ ను వైసీపీలో జాయిన్ చేయించి.. టీడీపీకి దూరం అయ్యారు. ఈ క్రమంలోనే.. అక్కడ వైసీపీ అభ్యర్ధిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ రెబల్ రాజకీయాలకు తెరలేపారు.

ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్.. అధికార పార్టీకి వ్యతిరేకంగా.. కరణం బలరాం నిలబెట్టిన అభ్యర్థులను ఓడించటానికి రెబల్ అభ్యర్థులను నిలబెట్టారు. ఈ విషయం తాడేపల్లిలోని సీఎం జగన్ వరకు చేరింది. అప్పటికప్పుడు ఆమంచికి అధిష్టానం నుంచి సూచనలు, సలహాలు వచ్చాయి. సర్దుబాటు రాజకీయంతో వ్యవహారాన్ని చక్కదిద్దారు వైసీపీ పెద్దలు.

కరణం బలరాం – ఆమంచి మధ్య వైరాన్ని పూర్తిగా తగ్గించాలని నిర్ణయించి సీఎం జగన్.. చీరాలకు పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గం బాధ్యతలు తీసుకోవాలని ఆమంచి కృష్ణమోహన్ కు సమాచారం పంపారు. పర్చూరు బాధ్యతలు చూసుకుంటున్న రామనాథంతో నేతులు, కార్యకర్తలకు అస్సలు పడటం లేదు. దీంతో ఆ బాధ్యతలను ఆమంచి అప్పగించాలని సీఎం జగన్ స్వయంగా ఆదేశించారు.

సీఎం జగన్ ఆదేశాలను సైతం లెక్కచేయని ఆమంచి కృష్ణమోహన్.. నెల రోజులు అవుతున్నా పర్చూరు వెళ్లలేదంట. పర్చూరు బాధ్యతలు స్వీకరించటానికి ఇష్టపడకపోగా.. చీరాలలో అసమ్మతి, రెబల్ రాజకీయాలు చేస్తున్నారంట. దీనిపై కరణం బలరాం స్వయంగా సీఎం జగన్ తోనే మాట్లాడారని టాక్. దీనిపై గట్టిగా దృష్టిపెట్టిన సీఎం జగన్.. మంత్రి బాలినేనిని స్వయంగా పిలిపించుకుని ఆమంచి విషయం చర్చించారంట.

ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వెళ్లాల్సిందే.. ఇది నా మాటగా చెప్పండి.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాలినేనికి చెప్పి పంపించారంట సీఎం జగన్. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వైఖరి ఎలా ఉండబోతుంది అనే ఆసక్తిగా నెలకొంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు