Ys Sharmila Party : కన్సిడర్ చేయండంటున్న షర్మిళ టీం.. లైట్ తీసుకుని వదిలేస్తున్న అన్ని పార్టీలు

no one bothers ysr telangana party of sharmila

వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టబోతున్న షర్మిళకు ముందస్తుగా చుక్కలు కనిపిస్తున్నట్లు ఉన్నాయి. సరైన రాజకీయ వ్యూహం లేకపోవటం.. వైఎస్ఆర్ కరుడుగట్టిన అభిమానులు దూరం అవ్వటంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలకు భిన్నంగా రాజకీయ వ్యూహాలు ఉండటంతో.. పార్టీ మైలేజ్ రోజురోజుకు తగ్గిపోతుంది. ఏ స్థాయిలో అంటే ఏ రాజకీయ పార్టీ సైతం.. కన్సిడర్ చేయటం లేదు.. అంటే గుర్తించటమే లేదు..

మొదట్లో విపరీతంగా ఆకాశానికెత్తిన ఎల్లో మీడియాకు ఇప్పుడు అసలు విషయం బోధపడింది.. ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చిందో బయటపడిన తర్వాత సైడ్ అయిపోయింది. దీంతో ఎల్లో మీడియా చూసీచూడనట్లు వదిలేసింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు, ఆరోపణలు కుమ్మరిస్తున్నారు వైఎస్ షర్మిల. కరోనాపై, లాక్ డౌన్ సడలింపుతోపాటు హుజూర్ నగర్ పర్యటన, ఉద్యోగ నోటిఫికేషన్ల అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఒక్కటి అంటే ఒక్క కౌంటర్ కూడా టీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి రాలేదు. అసలు గులాబీ దళం పట్టించుకోవట్లేదు. షర్మిలను ఫాలో కావటం లేదు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. దీంతో షర్మిలపై లేదా ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చే వాళ్లు లేకపోవటంతో ఇష్యూ కావటం లేదు. ఇక టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి ఇలా ఎవర్ని తీసుకున్నా.. షర్మిలకు కౌంటర్ పడటం లేదు.

ఇక బీజేపీ అన్నా స్పందిస్తుందా అంటే.. అబ్బే అస్సలు పట్టించుకోవటం లేదు. షర్మిల పార్టీ వ్యవహారాలు, ఆమె కామెంట్లు, ఆమె టూర్లు, ఆమె విమర్శలు, ఆరోపణల జోలికి వెళ్లటం లేదు బీజేపీ. నేతలు, కార్యకర్తలు స్పందించకపోయినా.. బీజేపీ సోషల్ మీడియా కూడా పట్టించుకోవటం లేదు.

మొన్నటి వరకు షర్మిలకు కౌంటర్ ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీలోని ఎంపీ రేవంత్ రెడ్డి వర్గం.. ఇప్పుడు ఆమెను విస్మరించింది. ఆమె ఏదో ట్విట్లు వేసుకుంటూ ఉంటుంది.. మనమెందుకు స్పందించాలి అంటున్నారంట. సోషల్ మీడియాలో షర్మిల కంటే.. షర్మిల పార్టీ కంటే.. షర్మిల సోషల్ మీడియా వింగ్ కంటే రేవంత్ రెడ్డి వర్గం చాలా బలంగా ఉంది. ఇప్పుడు షర్మిలను టచ్ చేస్తే.. ఆమెకు మైలేజ్ పెరిగినట్లు అవుతుందని.. మన ప్రత్యర్థిని మనమే పెంచినట్లు ఉంటుందని రేవంత్ రెడ్డి వర్గం సైడ్ అయిపోయింది.

ఈ రకంగా తెలంగాణలో పార్టీ పెట్టకముందే.. మైలేజ్ భారీగా మైలేజ్ కోల్పోతున్నారు షర్మిల. రాజకీయ వ్యూహాలు సైతం చప్పగా ఉండటం.. బలమైన సోషల్ మీడియా వింగ్ లేకపోవటంతో.. నన్ను కన్సిడర్ చేయండి అంటోంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ప్రత్యర్థి పార్టీలు మాత్రం లైట్ తీసుకోండి.. ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు.

పార్టీల దాకా ఎందుకు, నిన్న మొన్న హుజురాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే, ఆ కుటుంబం వారు షర్మిళను ఏమాత్రం లెక్క చేయకుండా మా ఇంటికి వద్దు అని మొత్తుకున్నారు. అయినా వినకుండా వెళితే, మాకెందుకు వచ్చింది గొడవ అని ఇంటికి తాళం వేసుకోని వెళ్లిపోయారు. ఈ ఒక్క ఉదాహారణ చాలు తెలంగాణలో షర్మిళ సత్తా ఏంటో తెలుసుకోవడానికి.  టోటల్ గా ఇప్పుడు తెలంగాణ ఆత్మఘోష అయ్యింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీది అంటున్నారు నెటిజన్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు