జగన్ – బీజేపీ కలిసి పవన్ కల్యాణ్ ను లేపుతున్నారు : తిరుపతి ఎన్నికలో కొత్త వ్యూహం – జనసేనకు ప్లస్ అవుతుందా?

జగన్ - బీజేపీ కలిసి పవన్ కల్యాణ్ ను లేపుతున్నారు.. తిరుపతి ఎన్నికలో కొత్త వ్యూహం - జనసేనకు ప్లస్ అవుతుందా?

తిరుపతి ఉప ఎన్నిక సరికొత్త రాజకీయ మలుపును తిప్పబోతుంది. సామాన్యులకు అర్థం కాని ఎత్తుగడ లోపయికారిగా కనిపిస్తుంది. తెర వెనక ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని.. అంత ఆలోచన లేని వారికి ఈ కథనం చదివితే.. కచ్చింగా అమ్మో ఏం ప్లాన్ రా బాబూ ఇది అంటారు.

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – బీజేపీ కలిసి వేసిన వ్యూహంలో టీడీపీ ఇరుక్కుందని స్పష్టం అవుతుంది. పవన్ కల్యాణ్ ను బీజేపీ ఆకాశానికెత్తుతుంది.. దీని వల్ల బీజేపీ కంటే జనసేన పార్టీకి ప్లస్ అవుతుంది. ఇదే సమయంలో అనవసరంగా.. అర్థం పర్థం లేని వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరల అంశాన్ని కోర్టు వరకు తీసుకెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఓ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏడు సినిమాలు విడుదల అయ్యాయి. ఏ సినిమా విషయంలోనూ అభ్యంతరాలు, రాద్దాంతం చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేవలం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా విషయంలోనే రచ్చకు తెర తీసింది.

పవన్ కల్యాణ్ సినిమాను రచ్చ చేయటం వల్ల జనసేన పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తుంది. దీని వల్ల ఆ పార్టీకే ప్లస్ అవుతుంది. ఇది పొత్తులో బీజేపీకి కలిసి వస్తుంది. దీని వల్ల టీడీపీ పార్టీ ప్రచారం మీడియా, సోషల్ మీడియాలో డైవర్ట్ అవుతుంది. వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – జనసేన – బీజేపీ మధ్య జరుగుతుంది. ఒక వేళ టీడీపీ.. వకీల్ సాబ్ సినిమా ఇష్యూలోకి ఎంటర్ అయితే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు. ఎందుకంటే అది ప్రత్యర్థి పార్టీ కాబట్టి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగానే.. వారి వ్యూహంలో టీడీపీ చిక్కుకుంది. వకీల్ సాబ్ మూవీ టికెట్ల ఇష్యూను చంద్రబాబు స్వయంగా ప్రస్తావించి.. ఎల్లో మీడియా ఎత్తుకోవటం వల్ల టీడీపీ కంటే పవన్ కల్యాణ్ కే అడ్వాంటేజ్ అయ్యింది. అంటే పోటీ వైసీపీ – బీజేపీ – జనసేన మధ్య అని ఓటర్లకు క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.

బీజేపీ – జనసేన పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా.. ప్రచారానికి కావాల్సిన సరుకును వైసీపీ స్వయంగా ఇవ్వటం అంటే.. టీడీపీని నాశనం చేయాలనే ఉద్దేశమే కదా.. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఇదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ను ఎంత లేపితే.. అంత టీడీపీ మైనస్.. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ – జనసేన పొత్త రెండో స్థానంలోకి వస్తే.. టీడీపీ పొజిషన్ మూడో స్థానానికి పడిపోతుంది. మానసికంగా.. అంతకు మించి రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టినట్లే కదా.. నలుగురు కొట్టుకుంటే ఓట్లు నాలుగురు చీల్చుకుంటారు.. అంతిమంగా వన్ అండ్ ఓన్లీగా లాభపడేది వైసీపీనే కదా.. వైసీపీకి బలమైన దళిత, రెడ్డి సామాజిక వర్గాలు గంపగుత్తగా ఉన్నాయన్న సంగతిని విస్మరించలేం కదా..

వకీల్ సాబ్ మూవీ టికెట్ల ఇష్యూను హైకోర్టు వరకు తీసుకెళ్లి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చ చేయటం వెనక వ్యూహం ఇదే.. లేకపోతే ఏడు సినిమాలకు లేని అభ్యంతరం.. ఈ మూవీ విషయంలోనే ఎందుకండీ.. ఒకవేళ పవన్ కల్యాణ్ ఇమేజ్ తిరుపతి ఉప ఎన్నికలో పెరిగితే.. బీజేపీ పొత్తు నుంచి బయటకు రాలేరు.. టీడీపీతో కలవలేరు.. ఒక వేళ బయటకు వచ్చి టీడీపీతో కలిస్తే.. ఇప్పుడున్న ఇమేజ్ కంటే మరింత డ్యామేజ్ అవుతాడు..

సో.. పవన్ కల్యాణ్ అనే జనసేన పార్టీని చక్రబంధంలో ఇరికించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – బీజేపీ పార్టీలు.. ఇంత లోగుట్టు సామాన్యులకు అర్థం కాకపోవచ్చు కానీ.. టీడీపీ ఎలా మిస్ అయ్యిందబ్బా

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు