ప్రాణం పోతున్న ఆ తల్లి ధ్యాసంతా పిల్లలపైనే

ప్రాణం పోతున్న ఆ తల్లి ధ్యాసంతా పిల్లలపైనే

ప్రాన్స్ లో బుధవారం ఉదయం మారణహోమం జరిగిన విషయం తెలిసిందే. ఓ చర్చిని టార్గెట్ చేసుకొని ఓ యువకుడు అందులో ఉన్నవారిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలతో 44 ఏళ్ల మహిళ మృతి చెందింది. ట్యునీషియాకు చెందిన 21ఏళ్ల బ్రహీం అస్వి ఫ్రాన్స్ లోని నోట్రాడామ్ చర్చీలోకి వెళ్ళాడు. తనతో 30 సెంటీమీటర్ల పొడవైన ఓ కత్తిని కూడా తీసుకెళ్లాడు.

అందులో ఉన్నవారిని కత్తితో పొడిస్తూ అల్లాహు అక్బర్ అంటూ రాక్షసానందం పొందాడు. ఈ దారుణంలో చర్చి లోపల 60 ఏళ్ల మహిళతో పాటు చర్చీ బయట కొద్దిదూరంలో చర్చీ ఉద్యోగి, బ్రెజిలియన్ కు చెందిన 44ఏళ్ల సిల్వపై కత్తితో పలుమార్లు దారుణంగా పొడిచాడు. దింతో తప్పించుకునేందుకు సిల్వ చర్చీ నుంచి పరుగులు తీసింది.

కొన ఊపిరితో స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద కుప్పకూలిపోతూ నాపిల్లలకు చెప్పండి నేను వాళ్లని ప్రేమిస్తున్నాను అని తెలిపారు.. ఈ విషయాన్నీ స్థానిక మీడియా ప్రచురించింది. కాగా గత కొద్దీ రోజులుగా ఫ్రాన్స్ లో మత కల్లోలాలు జరుగుతున్నాయి. దింతో ఫ్రాన్స్ ప్రెసిండెంట్ Emmanuel Macron టెర్రరిస్టులు ఎవరైనా కనిపిస్తే వెంటనే కాల్చివెయ్యాలని సూచించారు. అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి