మోడీ, యోగి తలలు నరికేస్తా :- తీవ్ర దుమారం రేపుతున్న వ్యాఖ్యలు

ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.. కొందరు ఇది దుర్వినియోగం చేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ అంటూ తప్పించుకున్న మేధావులు చాలామందే ఉన్నారు. తాజగా ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. వీటిని కూడా ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ కింద తీసుకోవాలి అంటే, ఖశ్చితంగా అది దుర్వినియోగం అవుతున్నట్లే లెక్క..

ఉత్తర్ ప్రదేశ్ చెందిన ఓ వ్యక్తి మోడీ యోగి తలలు నరికి మీ కాళ్ళ ముందు పెడతాను అంటూ ఓ సమావేశంలో మాట్లాడాడు.. రాష్ట్రీయ లోక్ దళ్ ఏర్పాటు చేసిన సమావేశంలో సదరు వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేశారు

ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడానికి కారణం

రాష్ట్రంలో హత్రాస్ ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.. ఈ హత్యాచారం, హత్యకేసులో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకులూ హత్రాస్ లోని బాధితురాలి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే కొందరు నేతలు వెళ్లారు.. మరికొందరిని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిలో రాష్ట్రీయ్‌ లోక్‌దళ్‌ నాయకుడు జయంత్‌ చౌదరి ఉన్నారు. దింతో పోలీసుల తీరుకు నిరసనగా మీరట్‌, బులంద్‌షహర్‌ అలీగఢ్‌, ముజఫర్‌ నగర్‌, బాగ్‌పట్‌, బిజ్నోర్‌ జిల్లాల్లో భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. కాగా ముజఫర్ నగర్ లో నిర్వహించిన మహా పంచాయత్ లో ఓ వ్యక్తి మోడీ, యోగి తలలు నరికేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశాడు..

ఈ మాటలకూ పంచాయత్ లో ఉన్న వారు చప్పట్లు కొట్టారు.. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తినట్లు సమాచారం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి