వకీల్ సాబ్ Vs వైల్డ్ డాగ్ – టికెట్ల రేటుపై వేరియేషన్స్ ఎందుకు.. ఎవరు ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు?

వకీల్ సాబ్ Vs వైల్డ్ డాగ్ - టికెట్ల రేటుపై వేరియేషన్స్ ఎందుకు.. ఎవరు ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు?

ఏపీలో పాలిటిక్స్ వర్సస్ మూవీస్ మధ్య యుద్ధం నడుస్తుంది. ఏప్రిల్ 9వ తేదీ విడుదల అయిన పవన్ కల్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లటం జరిగింది. మూడో రోజు నుంచి ప్రభుత్వ రేటు ప్రకారమే టికెట్ ధరలు ఉండాలని హైకోర్టు ఆదేశంతో.. ఏపీలో వకీల్ సాబ్ వసూళ్లు భారీగా తగ్గనున్నాయి.

ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరను 110 రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఇటీవల విడుదల అయిన నాగార్జున మూవీ వైల్డ్ డాగ్ మూవీ టికెట్ ధరను 150 రూపాయలకు అమ్మినా పట్టించుకోలేదు. వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ తెలంగాణలో 500 రూపాయలకు అమ్మితే.. ఏపీలో మాత్రం అసలు షోలే పడలేదు. రెగ్యులర్ గా నాలుగు షోలకు మాత్రమే సీఎం జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనికితోడు టికెట్ రేట్లను అధికంగా అమ్మటానికి ఒప్పుకోలేదు.

ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. నాగార్జున మూవీ వైల్డ్ డాగ్ సినిమా టికెట్ ధరను 150 రూపాయలను అమ్మినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది.. కళ్లు మూసుకుందా అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరను మాత్రం 110 రూపాయలకు మించకుండా అమ్మాలని ప్రత్యేకంగా ఆర్డర్స్ వేసిందని.. దీని వల్ల వసూళ్లు భారీగా పడిపోయాయని చెబుతున్నారు ఫ్యాన్స్.

పవన్ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేయటం వెనక రాజకీయ కుట్ర ఉందనేది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. పరిస్థితులు అలాగే ఉన్నాయని అనుకున్నా.. నాగార్జున సినిమా విషయంలో లేని ఆంక్షలు పవన్ కల్యాణ్ మూవీకే ఎందుకు ఉన్నాయనేది ప్రశ్న.

మామూలుగా కరోనాతో ధియేటర్లకు జనం రావటం లేదు. మొదటి రోజు ఫ్యాన్స్ హడావిడి తప్పితే.. రెండో రోజు నుంచి ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. ఒక్క వకీల్ సాబ్ విషయంలోనే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరూ ధియేటర్లకు రాకపోవటంతో.. వసూళ్లు గణనీయంగా తగ్గాయి. దీనికితోడు టికెట్ రేటు 110 రూపాయలకు మించకుండా అమ్మాలనే నిబంధన నిర్మాతకు ఇబ్బందిగా మారింది.

టికెట్ రేటు విషయంలో ఇప్పుడు పవన్ కల్యాణ్ వర్సెస్ నాగార్జున ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ప్రభుత్వం వర్సెస్ వకీల్ సాబ్ కాస్తా.. యూటర్న్ తీసుకోవటం విశేషం..

వకీల్ సాబ్ Vs వైల్డ్ డాగ్ - టికెట్ల రేటుపై వేరియేషన్స్ ఎందుకు.. ఎవరు ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు