హైదరాబాద్ సిటీ ఎల్బీ నగర్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పోరేటర్ ఆకుల రమేష్ గౌడ్ గురువారం సాయంత్రం గుండెపోటుతో చనిపోయారు. మొన్నటి ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన ఆయన.. గతంలో మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు. లింగోజీగూడ నుంచి గెలిచిన తర్వాత.. 15 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. గుండెపోటు రావటంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలిసిన బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు షాక్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఎంతో బాగా పని చేశారని.. సీనియర్ బీజేపీ నేతగా.. చుట్టుపక్కల డివిజన్లలో ప్రచారం చేశారని.. బీజేపీ గెలుపునకు ఎంతో కృషి చేశారని అంటున్నారు కార్యకర్తలు.
ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే అకాల మరణంతో విషాదంలో ఉన్నారు డివిజన్ లోని బీజేపీ కార్యకర్తలు, అభిమానులు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు రమేశ్ గౌడ్.