విషాదం అమెరికాలో కృష్ణా జిల్లా యువతి మృతి

ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన యువతి సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి మృతిచెందింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు కమల (26) ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నారు. ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఓ జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకునేందుకు ఆగింది..

సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రాణాలు విడిచింది.. ఆమె మృతి చెందిన విషయాన్నీ స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా నాట్స్‌ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఉద్యోగం కోసం వెళ్లిన కూతురు మృతుచెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి