గో కార్టింగ్ సరదా.. యువతి ప్రాణాలమీదకు తెచ్చింది

గో కార్టింగ్ బిటెక్ విద్యార్థి ప్రాణాలమీదకు తెచ్చింది.. ఈ సంఘటన నగర హైదరాబాద్ నగర శివార్లలో జరిగింది.. గుర్రంగూడ గో కార్టింగ్ ప్లే జోన్ లో చోటుచేసుకుంది. శ్రీ వర్షిణి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని స్నేహితులతో కలిసి గో కార్టింగ్ కు వెళ్ళింది.

గో కార్టింగ్ చేస్తున్న సమయంలోనే ఆమె తల వెంట్రుకలు టైర్లకు చుట్టుకున్నాయి.. దింతో యువతి ఒక్కసారిగా కిదపడిపోయింది ఆమె పెట్టుకున్న హీల్మెంట్ ముక్కలైంది.. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు బలమైన గాయం అయింది. దింతో ఆమెను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు గో కార్టింగ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి