ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది.. దేశం నివ్వెరపోయింది.. ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంది. కారణం ఏంటో తెలుసా యూట్యూబ్, జీ మెయిల్, గూగుల్ ఆగిపోయాయి. జీ మెయిల్ పని చేయలేదు. గూగుల్ సంస్థలో సాంకేతిక సమస్య వల్ల దేశవ్యాప్తంగా డిసెంబర్ 14వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాల సమయంలో డౌన్ అయ్యింది.
యూట్యూబ్, జీ మెయిల్ పని చేయకపోవటంతో దానిపై ఆధారపడిన అందరూ షాక్ అయ్యారు. ఇండియా గూగుల్ సర్వర్ డౌన్ కావటంతో నెటిజన్లు లక్షల మంది ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యూట్యూబ్ డౌన్ కాగానే అందరూ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అనుకుంటూ దాన్ని రీస్టోర్ చేయటానికి ప్రయత్నించి.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు.
#google #Gdrive #googledown #gmail #gmaildown #youtube #youtubedown #googledocs అన్ని కూడా డౌన్ అయ్యాయి.
2020లో కరోనా మాత్రమే అనుకున్నాం.. ఈ ఏడాది వెళుతూ వెళుతూ యూబ్యూబ్ డౌన్ అయితే ఎలా ఉంటుందో చూపించింది.