గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన ఒక కుక్క ఒకే కాన్పులో 18 మంది పిల్లలకు జన్మను ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
పెదకూరపాడు మండలంలోని లగడపాడు గ్రామానికి చెందిన వట్టికొట్టి సైదారావు అనే వ్యక్తి ఈ కుక్కను పెంచుతున్నారు. పోయిన ఏడాది ఇదే కుక్క ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మను ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.
గ్రీడేన్ బ్రీడ్ అయిన ఈ కుక్కలు చూడటానికి భారీగా కనిపించినప్పటికి చాలా సౌమ్యంగా ఉంటాయని సైదారావు వెల్లడించారు. యజమానులతో అత్యంత ప్రేమగా మెలిగే ఈ కుక్కను తన కోల్డ్ స్టోరేజ్ లో పెంచుతున్నట్టు చెప్పారు.
ఈ జాతికి చెందిన ఫీమేల్ డాగ్స్ సౌమ్యంగా ఉండటంతో పాటు ఒక్క కాన్పులో అనేక పిల్లలకు జన్మనిస్తాయని వెల్లడించారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి