#Viralnews ఆగ్రాలో రెండు గ్రూపుల కోతుల మధ్య ఘర్షణ జరిగిన తరువాత ఇద్దరు వ్యక్తులు ఎలా మరణించారు ?

two groups of monkeys fight in agra

ఉత్తర్ ప్రదేశ్ – ఆగ్రా : ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా సిటీలో కోతుల గుంపుల మధ్య జరిగిన ఘర్షణ లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. రెండు కోతుల మధ్య మొదలైన గొడవ పెరిగి పెరిగి 35 కోతుల మధ్య యుద్ధంగా మారింది.

ఈ ఘటనలో గోల్డ్ డీలర్ మరియు ఇంటి ఓనర్ అయిన లక్షణ్ తులసియాని ఇంకా అక్కడ పని చేయడానికి వచ్చిన డైలీ లేబర్ వీర మరణించారు. భారీ సంఖ్యలో కోతులు ఇంటి పైకి చేరడంతో ఇంటి గోడ కూలి వారిపై పడిన కారణంగా వీరి మరణం సంభవించింది.

లక్షణ్ తులసియాని ఇంకా వీర రెండవ అంతస్థులోని గోడ కింద నిలబడి బిల్డింగ్ ను పరిశీలిస్తున్న సమయంలో, పది అడుగుల ఎత్తైన గోడ కోతుల గొడవ కారణంగా కూలి వీరిపై పడింది.

ఒక్కసారిగా భారీ సంఖ్యలో కోతులు బిల్డింగ్ పైకి చేరడంతో పాటు, గెంతడం, కొట్టుకోవడం చేసిన కారణంగా ఒక్కసారిగా రెండవ అంతస్థులోని గోడపై ఒత్తిడిపెరిగిపోయి బీటలు వారి కుప్పకూలింది. దాదాపు పదిఅడుగుల భారీ గోడ మీద పడటంతో వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికులు, రక్షణ సిబ్బంది వెంటనే స్పందించి వారిని శిథిలాల నుండి బయటకుతీసి స్థానికంగా ఉన్న హాస్పటల్ కు తరలించారు. కాని తీవ్రంగా అయిన గాయాల కారణంగా వారు అప్పటికే మరణించారు.

ఆగ్రా సిటీలో కోతుల కారణంగా మరణాలు జరగడం ఇది మొదటి సారి కాదు. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. విపరీతంగా పెరిగిపోయిన కోతులు ప్రజల్లోకి వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ప్రజల మీద దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కోతులను తరిమికొట్టడానికి ఆగ్రా మున్సిపల్ సిబ్బంది చేసిన అన్ని ప్రయత్నాలను జంతు ప్రేమికులు అడ్డుకున్నారు.

గతంలో 12 సంవత్సరాల పిల్లవాడిపై అలాగే 58 సంవత్సరాల మహిళపై కోతుల దాడి చేసి మరణానికి కారణం అయిన సంఘటనలు ఉన్నాయి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి