గుంటూరు జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీ

గుంటూరు రూరల్ జిల్లాలో ఎస్ఐల బదిలీ పెద్ద ఎత్తున జరిగింది.. ఎస్పీ విశాల్ గున్ని పదిమందికిపైగా ఎస్ఐ లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జరిగి చేశారు..నరసరావుపేట-2 టౌన్‌ ఎస్సై పి శివ నాగరాజును శావల్యాపురంకు బదిలీ చేశారు. చిలకలూరిపేట రూరల్‌ ఎస్‌ఐ ఎ.బాలకృష్ణను నరసరావుపేట రూరల్‌కు, అక్కడ ఉన్న వెంకటేశ్వర్లును రూరల్‌ వీఆర్‌కు బదిలీ చేస్తూ ఆయనను స్పందన ఫిర్యాదుల స్వీకరణకు నియమించారు.

పిడుగురాళ్ళ ఎస్‌ఐ ఎల్‌.సుధీర్‌కుమార్‌ వెల్దుర్తికి, అక్కడ ఉన్న చెన్నకేశవులును మాచర్లటౌన్‌కు అటాచ్‌మెంట్‌ ఇచ్చారు. రూరల్‌ వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ సీహెచ్‌ ప్రతాప్‌కుమార్‌ దుగ్గిరాల స్టేషన్ కు బదిలీ చేశారు. అక్కడ ఉన్న పి.అనిల్‌కుమార్‌ను రూరల్‌ స్పెషల్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. దిశా స్టేషన్‌లో ఉన్న మహిళా ఎస్‌ఐ పిల్లి శ్రావణిని చుండూరు స్టేషన్‌కు బదిలీ చేశారు. వినుకొండ ఎస్‌ఐ జి.రాజ్యలక్ష్మిని దిశా స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

వీఆర్‌లో ఉన్న పి.భాగ్యరాజ్‌ను పొన్నూరు రూరల్‌కు, అక్కడ ఉన్న పి.కోటేశ్వరరావును అమరావతికి బదిలీ చేశారు. స్పందన సెల్‌లో ఉన్న కె.అమీర్‌ను రాజుపాలెంకు, అక్కడ ఉన్న కేవీ ప్రసాద్‌ను రూరల్‌ వీఆర్‌కు బదిలీ చేశారు. బాపట్ల టౌన్‌ ఎస్‌ఐ పి.హజరత్తయ్యను రొంపిచర్లకు, అక్కడ ఉన్న ఎస్‌.వెంకట్రావును రూరల్‌ స్పెషల్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి