విషాదం :- కుమారుడికి విషమిచ్చి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి

విషాదం :- కుమారుడికి విషమిచ్చి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఓ తల్లి మానసిక వికలాంగుడైన కొడుక్కి విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన పాతగుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సయ్యద్ అహ్మద్, చాంద్ బీ దంపతులు, పాతగుంటూరు స్టేషన్‌ పరిధిలోని తమ్మా రంగారెడ్డి నగర్‌ నాలుగో లైనులో నివాసం ఉండేవారు..

వీరికి ముగ్గురు కుమారులు. కాగా మూడు నెలల క్రితం చాంద్ బీ భర్త అహ్మద్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇక వారి ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడు కరీముల్లా, పూల వ్యాపారం చేస్తాడు. మిగిలిన ఇద్దరు కుమారుల మానసిక స్థితి సరిగా ఉండదు.

భర్త మరణంతో కుంగిపోయిన చాంద్ బీ, కుమారుల పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో మూడో కుమారుడు ఎస్థానికి విషమిచ్చి తాను విషం తాగింది. పెద్ద కుమారుడు కరీముల్లా చూసి వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దింతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు