GHMC ఎన్నికలకు హరీశ్ రావు వర్గం దూరం

ఎవరు అవునన్నా.. కాదన్నా హైదరాబాద్ సిటీలో హరీశ్ రావుకు రాజకీయ, పారిశ్రామిక, మీడియా వర్గాల్లో కొంత మద్దతు ఉంది. వీళ్లంతా కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ

గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల ముంచుకొస్తున్న వేళ.. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోతున్నారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత మొత్తాన్ని మంత్రి కేటీఆర్ భుజానికెత్తుకున్నారు. అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఎంఐఎంతో చర్చల నుంచి ప్రచార బాధ్యత కూడా కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీలో ఎన్నికలు ఏవైనా హరీశ్ రావు ఉండాల్సిందే. నిన్నటి దుబ్బాక ఓటమి తర్వాత హరీశ్ రావు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన పాత్ర సున్నా అవుతుంది. హరీశ్ వర్గం కూడా దూరంగా ఉంటుంది. అస్సలు పట్టించుకోవటం లేదు. దుబ్బాక ఓటమి బాధ్యత నాదే అని చెప్పిన హరీశ్ రావుకు పార్టీలోనే ఓదార్పు దక్కలేదంట. దుబ్బాక ద్వారా అంది వచ్చిన అవకాశంతో.. హరీశ్‌ను రాజకీయంగా టార్గెట్ చేయాలని టీఆర్‌ఎస్‌లోనే ఓ వర్గం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ బంపర్ విక్టరీ సాధిస్తే ఆ కష్టం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఖాతాలోకి వేసుకుంటున్నారు.. ఓటమి అయితే మంత్రి హరీశ్ ఖాతాలో పడేసి.. ఆయన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ వర్గం తీవ్రంగా మండిపడుతోంది.

ఎవరు అవునన్నా.. కాదన్నా హైదరాబాద్ సిటీలో హరీశ్ రావుకు రాజకీయ, పారిశ్రామిక, మీడియా వర్గాల్లో కొంత మద్దతు ఉంది. వీళ్లంతా కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైలెంట్ అయిపోయారు. హరీశ్ సోషల్ మీడియా టీం సైతం జీహెచ్ఎంసీ ఎన్నికలను పట్టించుకోవటం లేదంట. పార్టీతో.. ఈ ఎన్నికలతో మాకేం సంబంధం అన్నట్లు వ్యవహరించటం విశేషం.

ఓ ప్రముఖ పత్రికలో.. ఆదివారం వచ్చిన కథనం చూస్తే.. ఇదే స్పష్టం అవుతుంది. దుబ్బాక ఓటమికి హరీశ్ రావు ఒక్కరిదే బాధ్యత అయితే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేం ఎందుకు పని చేయాలి అనే ధోరణి వారిలో కనిపించటం విశేషం.
దుబ్బాక దెబ్బతో కాక మీదున్న హరీశ్ రావు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగా ఉంటే.. వారి మద్దతుదారులు ఓట్లు ఎటువైపు వెళతాయి అనేది ఆసక్తి రేపుతోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి