తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనా వైరస్ను జయించారు. సెప్టెంబర్ 5 న హరీష్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ కావడంతో హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. కరోనా నెగటివ్ వచ్చిందన్న విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇంటి వద్దే ఉంటూ వైద్యుల సలహాల మేరకు మందులు వాడుతూ..తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమంగా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా హైదరాబాద్లోని కోఠి ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో మంత్రి హరీష్ రావుకు నెగటివ్ వచ్చిందని డాక్టర్లు ప్రకటించారు.
తమ అభిమాన నేత కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో హరీష్ రావు అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్ధికమంత్రి లేకుండానే కొనసాగుతున్నాయి. కరోనా నెగటివ్ రావడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది
మీ అభిప్రాయం కామెంట్ చేయండి