హత్రాస్ ఘటన.. బాధితురాలి కుటుంబానికి భారీబందోబస్తు..
హత్రాస్ ఘటనలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది.. హత్యకు గురైన యువతిపై అత్యాచారం జరగలేదని గతంలో వైద్యులు తెలిపారు. ఇక పోలీస్ ఇంటరాగేషన్ లో కూడా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హత్య అనుమానం కుటుంబ సభ్యులమీదనే వ్యక్తమవుతోంది. ఆమె స్నేహితుడు సందీప్ ఠాకూర్ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సందీప్ పోలీసులకు లేఖ రాశాడు.. తమకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని, తన ముగ్గురు స్నేహితులు నిర్దోషులని, తమకు ఏ పాపం తెలియదని.. కావాలనే బాధితురాలి కుటుంబ సభ్యులు తమను కేసులో ఇరికించారని తెలిపారు.
ఇక ప్రస్తుతం బాధితురాలి కుటుంబ సబ్యులకు ప్రాణహాని ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.. కొందరు వ్యక్తులు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి హత్య చేసేందుకు కుట్ర పన్నారని పోలీసులకు సమాచారం అందింది.. దింతో హత్రాస్ లో 60 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుల్గరిలోని బాధిత కుటుంబం ఇంటి వద్ద 8 సీసీటీవీ కెమెరాలను బిగించారు. అంతేకాదు, అవసరమైతే గ్రామంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు.
కాగా ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఈ కేసుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. హత్రాస్ ఘటనలో ఘర్షణలు జరగడానికి విదేశాల నుంచి ఇక్కడికి డబ్బులు వచ్చాయని ఇంటిలిజెన్స్ గుర్తించిందని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.
100 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు.. వీటిలో సుమారు 50 కోట్లు హత్రాస్ లో అల్లర్ల కోసం వాడారని వారు పేర్కొన్నారు.