ఛాటింగ్ వద్దంటే ఇంట్లోనుండి పారిపోయింది

hayath nagar girl missing from home

24 గంటలు అదే పనిగా ఛాటింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో గడుపుతుందని తల్లిదండ్రులు తిట్టడంతో యువతి కనిపించకుండా పోయిన ఘటన హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ లో చోటు చేసుకుంది.

హయత్ నగర్ లోని గడ్డి అన్నారంకు చెందిన బబ్లీ ( లారా రవికుమార్ ) నిత్యం సోషల్ మీడియా ఛాటింగుల్లో మునిగితేలుతుండటంతో తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. తల్లిదంద్రులు గట్టిగా మందలించారనే కోపంతో రాత్రి 8 గంటల సమయం నుండి కనిపించకుండా పోయింది.

యువతి కనిపించడం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు హయత్ నగర్ పోలీసులకు తెలియజేయడంతో సీసీ కెమెరా ఫుటేజ్ అధారంగా బబ్లీ ఆచూకీని కనుక్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కథనాన్ని ప్రత్యేకంగా కవర్ చేసిన  NTV తెలుగు న్యూస్ ఛానెల్

తెలుగు న్యూస్ ఛానెల్ అయిన NTV ఆ యువతి మిస్సింగ్ కథనాన్ని ప్రత్యేకంగా కవర్ చేసింది. కనిపించకుండా పోయిన ఆ యువతి తల్లిదండ్రులతో ఆ ఛానెల్ రిపోర్టర్ రాధా కృష్ణ ప్రత్యేకంగా మాట్లాడారు.

ఫోన్ విషయంలో మందలించిన కారణంగా ఇంట్లో నుండి వెళ్లిపోయిందా లేక మరే ఇతరకారాణాల వల్ల ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా అనే విషయంపై తమకు స్పష్టత లేదని బబ్లీ తల్లి అన్నారు.తనపై కొప్పడింది తన బాగుకోసమే తప్ప మరో ఉద్దేశంతో కాదని దయచేసి ఇంటికి తిరిగిరావాలని యువతి తల్లి మీడియా ముఖ్యంగా అభ్యర్థించారు.

ఈ కథనాన్ని చూసిన ప్రతి ఒక్కరు పై ఫోటోలోని యువతి మీకు ఎక్కడైన కనిపిస్తే 100 లేదా స్థానిక పోలీసుకు సమాచారం అందించాలని Sugerly Team సైతం కోరుకుంటుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి