ప్రతి రోజు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 లాభాలు

గతంలో బీట్ రూట్ ని తినాలంటే చాలా మంది ఆలోచించేవారు. తియ్యగా, వగరుగా ఉండే ఈ దుంపను తినడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. కాని బీట్ రూట్ ఉపయోగాలు తెలిసిన తరువాత , లక్షలాది మంది హెల్తీ డైట్ లో ఇది ఒక భాగం అయింది.

health benifits of driking beet root juice

గతంలో బీట్ రూట్ ని తినాలంటే చాలా మంది ఆలోచించేవారు. తియ్యగా, వగరుగా ఉండే ఈ దుంపను తినడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. కాని బీట్ రూట్ ఉపయోగాలు తెలిసిన తరువాత , లక్షలాది మంది హెల్తీ డైట్ లో ఇది ఒక భాగం అయింది. జ్యూస్ లేదా సలాడ్ ఇలా ఏదో ఒకరూపంలో ప్రతి రోజు తీసుకుంటే మంచిదని అనేక మంది డైటీషియన్లు సూచిస్తున్న నేపథ్యంలో బీట్  రూట్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం…

1బీట్ జ్యూస్ ఉపయోగాలు : రక్తపోటును తగ్గిస్తుంది

బీట్‌రూట్ జ్యూస్ మీ రక్తపోటును తగ్గించడంలో లేదా అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ 200 – 250మిల్లీ లీటర్ల బీట్‌రూట్ జ్యూస్ తాగిన వ్యక్తులు సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రక్తపోటు రెండు అదుపులో ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. బీట్‌రూట్ లో ఉండే నైట్రేట్లు కాంపౌండ్స్ రక్తంలో నైట్రిక్ యాసిడ్‌గా మారి రక్త నాళాలను రిలాక్స్ అయ్యేలా చేయడం వల్ల రక్తనాళాలకు విశ్రాంతి దొరుకుతుందని అందువల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

2బీట్ జ్యూస్ ఉపయోగాలు : స్టామినాను పెంచుతుంది

2012 లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం  బీట్‌రూట్ జ్యూస్ శరీరంలోని ప్లాస్మా నైట్రేట్ స్థాయిని పెంచుతుంది మరియు శారీరక పనితీరును పెంచుతుంది. ఈ ప్రయోగం చేసేప్పుడు  రోజూ 2 కప్పుల బీట్‌రూట్ రసం తాగిన శిక్షణ పొందిన సైక్లిస్టులు, వారి 10 కిలోమీటర్ల సైక్లింగ్ సమయంలో 12 సెకన్లు తగ్గడమే కాక ఆక్సిజన్ తీసుకునే శాతం తగ్గింది.

3బీట్ జ్యూస్ ఉపయోగాలు : మజిల్ పవర్ పెంపు

బీట్ రూట్ జ్యూస్ లో ఉండే నైట్రేట్ల వల్ల కండరాలు బలంగా తయారవుతున్నట్టు 2015 లో సైంటిస్ట్లు గుర్తించారు. 2015 లో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం బీట్ రూట్ జ్యూస్ తాగిన రెండు గంటల తర్వతా గుండె జబ్బులు ఉన్న వారి కండరాల శక్తి 13 శాతం పెరిగినట్టు గుర్తించారు. కాబట్టి బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది.

4బీట్ జ్యూస్ ఉపయోగాలు : మజిల్ పవర్ పెంపు

వృద్ధులలో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి మరియు మతి మరుపు వచ్చే గుణాన్ని నెమ్మది చేయడానికి నైట్రేట్లు సహాయపడతాయి. బీట్ రూట్ లో ఈ నైట్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల డిమెన్షీయా లేద మతి మరుపు వచ్చే వేగం నెమ్మదిస్తుంది. ఈ విషయంలో అనేక ప్రయోగాలు జరిగినప్పటికి నూటికి నూరు శాతం ఇది నిరూపణ కాలేదు. అయితే బీట్ రూట్ తినడం లేదా బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మతిమరుపు తగ్గడం, అల్జిమర్స్ వచ్చే వేగం తగ్గడం మాత్రం జరుగుతుంది.

5బీట్ జ్యూస్ ఉపయోగాలు : శరీర బరువు అదుపులో ఉంచడానికి

బీట్ రూట్ జ్యూస్ లో కొవ్వు మరియు కెలరీలు అతి తక్కువగా ఉంటాయి. ప్రతి రోజు 200 నుండి 250 మిల్లీలీటర్ల బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయి. ఉదయాన్నే తాగడానికి బీట్ రూట్ జ్యూస్ ఎంతో అనువైనది.

6బీట్ జ్యూస్ ఉపయోగాలు : క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది

2014 లో జరిగిన పరిశోధనల ప్రకారం బెటాలైన్లకు ( ప్లాంట్ పిగ్మెంట్స్  ) క్యాన్సర్ కణాలను ఎదుర్కునే గుణం ఉందని తేలింది. శరీరంలోని క్యాన్సర్ కణాలను కనుగొని నాశనం చేయడానికి ఉపయోగపడే ఫ్రీ రాడికల్ క్లీనర్స్ గా సైతం బెటాలైన్లు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇటువంటి బేటాలైన్లు బీట్ రూట్ లో ఎక్కువగా ఉండటం వల్ల వీటికి క్యాన్సర్ ను నివారించే గుణం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

7బీట్ జ్యూస్ ఉపయోగాలు : అధిక పొటాషియం

శారీరంలోని నరాలు, కండరాలు సరిగ్గా పనిచేయాలంటే పొటాషియం అనేది చాలా అవసరం. శరీరంలో పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్ లాగా పనిచేసి యాక్టివ్ గా ఉంచుతుంది. శరీరంలో పొటాషియం లెవల్స్ తగ్గితే అలసట, బలహీనపడటం, తిమ్మిర్లు వంటివి సంభవిస్తాయి. మనిషి కావాల్సిన పొటాషియం బీట్ రూట్ లో అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు బీట్ రూట్ తినడం లేదా బీట్ రూట్ జ్యూస్ తాగవడం వల్ల శరీరానికి కావాల్సిన పొటాషియం కొంత వరకు అందే అవకాశం ఉంది.

8బీట్ జ్యూస్ ఉపయోగాలు : అన్ని మినరల్స్ లభ్యం

అవసరమైన ఖనిజాలు/ మినరల్స్ లేకుండా మన శరీరం సరిగా పనిచేయదు. కొన్ని ఖనిజాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి, మరికొన్ని ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు ఏర్పడటానికి సాయం చేస్తాయి. మనం పైన చెప్పుకున్నట్టు బీట్ రూట్ లో   పొటాషియంతో పాటు కాల్షియం , ఐరన్, మెగ్నీషియం , మాంగనీస్ , ఫాస్పరస్ , సోడియం, జింక్ , కాపర్ , సెలీనియం వంటి ఇతర మినరల్స్ సైతం బీట్ రూట్ నుండి కొద్దిమోతాదులో లభిస్తాయి.

9బీట్ జ్యూస్ ఉపయోగాలు : విటమిన్ C లభ్యం

బీట్ రూట్ లో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. విటమిన్ సీ యాంటీఆక్సిడెంట్ గా పని చేసి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చర్మం ఎప్పుడు నిగనిగలాడుతుంది. అలాగే గాయాలు త్వరగా మానడానికి కూడా సాయం చేస్తుంది. ఇక తిన్న ఆహరంలో ఉన్న ఐరన్ శరీరంలో పీల్చుకోవడంలో కూడా విటమిన్ సీ ఎంతో అవసరం. కాబట్టి విటమిన్ సీ అధికంగా ఉండే బీట్ రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తీసుకోవడం ఎంత ఉపయోగరమో అని.

10బీట్ జ్యూస్ ఉపయోగాలు : లివర్ కి మంచిది ,కొలస్ట్రాల్ తగ్గిస్తుంది

బీట్ రూట్ లో ఉండే బీటైన్ అనే పదార్థం లివర్ లోని టాక్సిన్స్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అధిక మద్యపానం, ఫ్రైడ్ ఫుడ్స్ , బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తినే వాళ్లు బీట్ రూట్ జ్యూస్ తాగితే లివర్ కు మేలు జరుగుతుంది. లివర్ లో ఉండే కొవ్వు నిల్వలను తొలగించడానికే కాక శరీరంలో ఉండే బ్యాడ్ కొలస్ట్రాల్ ని సైతం బీట్ రూట్ జ్యూస్ తగ్గిస్తుంది.

బీట్ రూట్ జ్యూస్ లేదా బీట్ రూట్ రసం తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నప్పటికి అధికంగా తీసుకోవడం మంచిది కాదు.

బీట్ రూట్ బ్లడ్ ప్రజర్ ను తగ్గిస్తుందన్న విషయం తెలిసిందే.. అయితే లో బ్లడ్ ప్రజర్ తో ఇబ్బంది పడే వారు, బీట్ రూట్ జ్యూస్ తగ్గించి తాగడం మంచిది.

అలాగే బీట్ రూట్ లో ఉండే ఆక్సాలేట్స్ కారణంగా కిడ్నిలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి కాల్షియం ఆక్సాలేట్స్ ( కిడ్ని రాళ్ల ) సమస్యలతో నిత్యం ఇబ్బంది పడే వాళ్లు తక్కువగా తీసుకుంటే మంచిది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి