కరోనాకు.. ఇంట్లోనే కార్పొరేట్ వైద్యం : 15 రోజులకు రూ.20 వేలు

corona treatment from home

కరోనా పాజిటివ్ వచ్చి ప్రైవేట్ ఆస్పత్రి జాయిన్ అయితే చాలు.. నాలుగు రోజుతలకు మూడున్నర లక్షలు బిల్లు వేసింది యశోధా ఆస్పత్రి. ఈ బిల్లు చూసి అందరూ షాక్. కరోనాతో కంటే అప్పులతో చచ్చేలా ఉన్నాం అని వణికిపోయారు సామన్య, మధ్య తరగతి ప్రజలు. కార్పొరేట్ ఆస్పత్రుల కరోనా దోపిడీపై విమర్శలు, ఆరోపణలు రావటంతో.. రూటు మార్చారు. కొత్త తరహాలో ట్రీట్ మెంట్ కు సన్నాహాలు చేస్తున్నారు. అదెలాగో తెలుసుకోండి.

ఇంట్లోనే కార్పొరేట్ వైద్యం

మీకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినా ఆస్పత్రికిలో చేర్చుకోరు. హోం క్వారంటైన్ లో ఉంచి.. చికిత్స చేసే విధానానికి కార్పొరేట్‌ ఆస్పత్రులు శ్రీకారం చుట్టాయి. ప్రణాళికలు సిద్ధం చేశాయి. 15 రోజుల హోం క్వారంటైన్‌ లో చికిత్స కోసం 20వేల రూపాయలు వసూలు చేయనున్నారు. ఈ 15 రోజులూ కరోనా పేషంట్ కు ఆస్పత్రిలో చికిత్స అందించినట్టుగానే.. ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం డాక్టర్ తో వీడియో కాల్ లో మాట్లాడొచ్చు.

లక్షణాలు చెబితే అందుకు తగినట్లుగా మందులు ఇస్తారు. ఎలాంది ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది వివరిస్తారు. బ్రీతింగ్ సమస్య ఉంటే వ్యాయామంపై సూచనలు, సలహాలు ఇస్తారు. ఇంట్లో ఉండే కరోనా పేషంట్లకు ఎన్‌-95 మాస్క్‌లు, పీపీఈ కిట్లు, గ్లౌజులు ఇస్తారు. మందులు కూడా హోం డెలివరీ చేస్తారు. ఈ విధానంలో చికిత్స అందించినట్లయితే డాక్టర్ల సేఫ్.. రోగికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. ఈ విధానంలో చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్రణాళికలు సిద్ధం చేశాయి.

కేసులు పెరగటంతోనే ఈ నిర్ణయం 

కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అందరికీ కార్పొరేట్ వైద్యం అందించటం సాధ్యం కాదు. డబ్బులు ఉన్నా.. బెడ్స్ దొరికే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో పరిణామాలను ఊహించి.. ముందుగానే కొత్త తరహా ఐడియాతో ముందుకు వచ్చాయి కార్పొరేట్ ఆస్పత్రులు. సన్ షైన్, అపోలో, కేర్, యశోదా ఆస్పత్రులు ఈ తరహా ట్రీట్ మెంట్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే టెలీ మెడిసిన్ ద్వారా ఇతర రోగులకు చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా కరోనా పాజిటివ్ వ్యక్తులకు కూడా హోం క్వారంటైన్ లో ఉంచి.. ఆన్ లైన్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించాయి.

గుడ్డిలో మెళ్ల అంటే ఇదే.. ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాటు అయ్యే కంటే.. ఇంట్లోనే ఉండి కార్పొరేట్ వైద్యం మంచిదే అని కొందరు అంటుంటే.. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యాపారం ఎలా చేయాలో కార్పొరేట్ ఆస్పత్రులను చూసి నేర్చుకోవాలి అని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా కరోనాకు చికిత్స అనేది ముఖ్యం.. ఎందుకంటే ప్రభుత్వం చేతులెత్తేంది కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు