అధికార పార్టీలో గుబులు.. హైదరాబాద్ మేయర్ కరోనా పాజిటివ్.

హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. గతంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా ఆయనకు నెగటివ్ వచ్చింది. కాగా మళ్ళి అనుమానం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ గా తెలిసింది. దింతో ఆయ‌న హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే ఇటీవల మేయర్ కేటీఆర్ ను కలిశారు.

అంతే కాకుండా హైద‌రాబాద్ న‌గరంలో జ‌రుగుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వ‌రుసగా హాజ‌ర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు క‌రోనా వైర‌స్ సోకి ఉంటుంద‌ని వైద్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా ఇటీవల ఆయన సన్నిహితులతో పాటు డ్రైవర్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం డ్రైవర్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది.

ఇక మేయర్ ను కలిసిన వాళ్ళు పరీక్షలు చేయించుకుంటున్నారు. కొందరు స్వచ్చందంగా హోంక్వారంటైన్ లోకి వెళ్లారు. కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే మేయర్ ఓ ప్రకటిన విడుదల చేశారు. తాను ఏ ఆస్ప‌త్రిలోనూ చేరనని ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతాన‌ని, ఇంటి నుంచే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మానిట‌రింగ్ చేస్తాన‌ని తెలిపారు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తానని అన్నారు. ఇక మేయర్ కుటుంబ సభ్యులలో ఎవరికి కరోనా పాజిటివ్ రాలేదు. అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన సమయంలోనే కరోనా సోకి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు