Hetero Drugs దుర్మార్గం : నిర్లాక్ష్యానికి బలవుతున్న మత్స్యకారులు

visakha hetero factory pollutions effects people around

తమ ప్రాంతానికి ఫార్మా కంపెనీ వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి బతుకుల్లో వెలుగులు నిండుతాయని అనుకుంటే ఉద్యోగాలు రాకపోగా అదే పరిశ్రమ తమ జీవితాలకు శాపంగా మారిందని అక్కడి మత్స్యకారులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.

ఇదే అంశంపై మా రిపోర్టర్ అక్కడి స్థానికులతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు వెలుగులోకివచ్చాయి. ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో సైతం అనేక కోతలు పెడుతూ, కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు సైతం ఈ పరిశ్రమపై దృష్టి పెట్టకపోవడం అనేక అనుమానాలకు తావు ఇస్తుంది.

విశాఖజిల్లా నక్కపల్లి హెట్రో డ్రగ్స్ పరిశ్రమ పరిధిలోని ఉప్పుటేరు వ్యర్థాల కారణంగా కలుషితం అయి చేపలు చనిపోతున్నాయి స్థానిక నేత సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పల రాజు వ్యాఖ్యానించారు.

నక్కపల్లి పరిధిలోని రాజయ్యపేట సమీపంలో దాదాపు 450 ఎకరాల్లో ఉన్న ఉప్పుటేరుపై చుట్టుపక్కల గ్రామాల్లోని అనేక మంది మత్స్యకారులు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఫ్యాక్టరీ నుండి వస్తున్న కెమికల్స్ కారణంగా చేపలు చనిపోయి రాజయపేట, దొండవాక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని అప్పల రాజు వెల్లడించారు.

ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకొని హెట్రో డ్రగ్స్ పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని అప్పలరాజు డిమాండ్ చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి