OMG.. మంగళవారం నాడు మరణ మృదంగం : ఆల్ టైం హైలో కరోనా కేసులు మరణాలు

corona deaths all time record in india

OMG.. మంగళవారం నాడు మరణ మృదంగం : ఆల్ టైం హైలో కరోనా కేసులు మరణాలు, అని పెట్టి భయపెట్టాలనే ఉద్దేశం కాదు. ప్రస్తుతం దేశంలో కరోనా ఎలా ఉంది.. ఏ స్థాయిలో కేసులు వస్తున్నాయి అనటానికి ఏప్రిల్ 27వ తేదీ లెక్కలే సాక్ష్యం. దేశవ్యాప్తంగా 3 లక్షల 60 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3 వేల 293 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు.. కరోనాకు మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుంది.

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 29 లక్షలకు చేరుకుంది. ఆది చాలా ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. యాక్టివ్ కేసులు పెరిగే కొద్దీ.. వారి వల్ల వైరస్ వ్యాప్తి అదే స్థాయిలో ఉంటుందని.. కరోనా ఉన్నా.. లక్షణాలు లేకపోవటం వల్ల బయట తిరుగుతున్నారని.. వీరి వల్ల నెల రోజుల్లోనే.. ఒకరి నుంచి 406 మందికి వైరస్ సోకుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిస్థితే ఉందని.. యాక్టివ్ కేసులు 29 లక్షలు దాటడంతో.. వారి నుంచి ఇంకెంత మంది కరోనా వచ్చింది అనేది అత్యవసరంగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఇప్పటికే చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇది సరిపోదు అంటున్నారు నిపుణులు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు కరోనా కేసులు తగ్గినా.. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత అంతర్ రాష్ట్ర సర్వీసుల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మళ్లీ వైరస్ ప్రబలే అవకాశం ఉందని చెబుతున్నారు.

దేశంలో ఏప్రిల్ 27వ తేదీ మంగళవారం మరణ మృదంగం మోగింది. 3 వేల 293 మంది ఒక్క రోజులో చనిపోవటం, ఒక్క రోజులో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 60 వేలకు చేరటం ఆషామాషీ విషయం కాదు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు