తెలుసుకోండి : ఫోన్ లోని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పని చేస్తుంది ?

how finger print scanner works in mobile

ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి ఒక్క మొబైల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కామన్ అయిపోయింది. 5 వేల ఫోన్ అయినా, పది వేల ఫోన్ అయినా ఫింగర్ ప్రింట్ అనేది చాలా కామన్ గా మారిపోయింది.మరీ ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పని చేస్తుంది, మనం ఇలా వేలు పెట్టగానే అలా డిటెక్ట్ చేసి ఫోన్ ని ఎలా అన్ లాక్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ మెయిన్ రోల్స్ ఇవే 

మనం ఏ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను తీసుకున్నా దాని ముఖ్యమైన పనులు రెండే ఉంటాయి. ఒకటి చేతి వేలిని స్కాన్ చేసి ఆ ఫోటోలని లేదా దానికి సంబంధించిన డేటాని స్టోర్ చేయడం, అలాగే స్కానర్ మీద వేలు పెట్టినప్పుడు స్టోరేజ్ లో ఉన్న ఆ ఫోటోలతో లేదా డేటాతో కంపేర్ చేసి ఫోన్ ను అన్ లాక్ చేయడం.

ఈ రెండు పనులను సరిగ్గా పూర్తి చేయడానికి రెండు విధానాలు ఉన్నప్పటి ఈ కాలపు అన్ని స్మార్ట్ ఫోన్లలో  కాపాసిటివ్ స్కానర్స్ ( Capacitive scanners ) అనే టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు.

కెపాసిటివ్ స్కానర్లు ఎలా పని చేస్తాయి

ఈ స్కానర్లు చేతి వేలిని ఫోటో తీసే పాతపద్ధతికి బదులుగా , వేలికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి కెపాసిటర్ సర్క్యూట్లను ఉపయోగిస్తాయి. అనేక వరుసల్లో ఏర్పాటు చేయబడిన ఈ కెపాసిటర్లు వేలు పెట్టె స్కానర్ ప్లేట్ లేదా గ్లాస్ కింద ఉంటాయి.

మనం మన చేతి వేలిని సరైన స్థానంలో పెట్టినప్పుడు వేలి మీద ఉన్న ఎత్తుపల్లాల ఆధారంగా ఏర్పడే ఎలక్ట్రికల్ ఛార్జ్ ను కెపాసిటర్లు స్టోర్ చేసుకుంటాయి. మారిన ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆధారంగా వచ్చే డేటాను డిజిటల్ రూపంలోకి మార్చి స్టోర్ చేస్తారు.

Capacative-Fingerprint-Scanner-design

స్టోర్ చేయబడిన ఈ డేటాను భవిష్యత్తులో ఉపయోగించడానికి వాడుకుంటారు. అంటే మనం ఫోన్ అన్ లాక్ చేయడానికి లేదా వేరే యాప్స్ కు లాక్ ఎనబుల్ చేయడానికి లేదా ఇంకా ఏదైనా ఇతర అవసరం కోసం వాడుకోవచ్చు.

మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద వేలు పెట్టినప్పుడు ఏర్పడే ఎలక్ట్రికల్ ఛార్జ్ కెపాసిటర్ల ద్వారా గ్రహించబడి డిజిటల్ రూపంలోకి మారుతుంది, ఇలా మారిన డేటాను ఫోన్లోని సెన్సార్లు అప్పటికే స్టోర్ చేయబడిన డేటాతో క్రాస్ చెక్ చేసుకోని కరెక్ట్ గా మ్యాచ్ అయితే ఫోన్ అన్ లాక్ చేస్తాయి లేకపోతే ఎర్రర్ మెసేజ్ ని చూపిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి