Corona In Gujarat : గుజరాత్ లో కరోనా కేసుల సునామీ – బెడ్స్ లేక ఆస్పత్రుల బయటే రోగులు.. శ్మశానాలు ఫుల్

huge growth in corona cases in gujarat

గుజరాత్ అనగానే ఆహోఓహో.. అభివృద్ధి అంటే అదే అంటూ భజన చేయటం తప్పితే.. ఇప్పటి వరకు మరొకటి తెలియదు మీడియాకు కూడా.. కరోనాతో గుజరాత్ రాష్ట్రం వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలిసిపోయింది. ఆస్పత్రుల్లో పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు కనీస వైద్యం అందించే స్థాయిలో కూడా లేవు అక్కడి ఆస్పత్రులు.

మొదటి వేవ్ లోనే కాదు.. సెకండ్ వేవ్ లోనూ గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల సునామీలా ముంచెత్తుతోంది. ఏప్రిల్ 17వ తేదీ నాటికి.. 24 గంటల్లోనే 9 వేల కేసులు నమోదు అయితే.. వంద మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 50 వేలపైనే ఉన్నాయి.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 47 వేల బెడ్స్ ఉన్నాయి అని చెబుతుంది. అంటే బెడ్స్ కంటే మూడు వేల మంది రోగులు అదనంగా ఆస్పత్రుల దగ్గర బెడ్స్ కోసం.. చికిత్స కోసం పడిగాపులు కాస్తున్నారు.

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కరోనా మరణాల సంఖ్య.. శ్మశానాల్లో కాలుతున్న చితి మంటలకు పొంతన లేదు అనే మాట వినిపిస్తోంది. ఏప్రిల్ 16వ తేదీ వంద మంది మాత్రమే చనిపోయారని గుజరాత్ ప్రభుత్వం చెబుతుందో.. రాష్ట్రవ్యప్తంగా దాదాపు అన్ని శ్మశాన వాటికల్లో రోజంతా చిత మంటలు రగులుతూనే ఉన్నాయి.

రాజ్ కోట్ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులు అన్ని ఫుల్ అయ్యాయి. కొత్త వస్తున్న పేషెంట్లకు బెడ్స్ లేక.. కార్లు, ఆటో రిక్షాలు, రిక్షాల్లోనే ఉండి సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటున్నారు కరోనా పేషెంట్లు.

గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల సునామీ ఉందని.. వాస్తవ పరిస్థితులు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం అంత సీరియస్ గా స్పందిస్తున్నట్లు లేదు. ఎప్పటిలాగే ఆహో ఓహో అంటూ.. అన్ని చర్యలు తీసుకున్నాం.. బెడ్స్ కావాల్సినన్ని ఉన్నాయి.. టెస్టులు చేస్తున్నాం.. కరోనా అదుపులో ఉంది అని చెబుతోంది.

ప్రభుత్వమే కాదు.. ఎవరు అబద్ధం చెప్పినా.. శవం మాత్రం నిజం లాంటిది.. నిప్పు కాలుతుందో కానీ.. శవం మాత్రం ఎప్పటికైనా నిజాన్ని బయటపెడుతుంది అంటున్నారు గుజరాత్ ప్రజలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు