ప్రియుడి కోసం భర్తను చంపింది

ప్రియుడి కోసం భర్తను చంపింది

వివాహేతర బంధం మోజులోపడి భర్తను కడతెర్చిందో భార్య.. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో మూడు రోజుల క్రితం ఓ మృతదేహం కనిపించింది. దింతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

చనిపోయిన వ్యక్తి జె.నారాయణగా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. సంచిలో మృతదేహం తీసుకొచ్చినట్లు కనుగొన్నారు. ఇద్దరు వ్యక్తులు ఓ బైక్ పై సంచిలో మృతదేహం తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్లినట్లు గుర్తించి, నారాయణ ఇంటికి వెళ్లి చూశారు. అయితే అక్కడ ఆయన భార్య కనిపించలేదు.

పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి