హైదరాబాద్ లో కిడ్నాప్ అయిన డాక్టర్ అనంతపురంలో దొరికారు

హైదరాబాద్ లో కిడ్నాప్ అయిన డాక్టర్ అనంతపురంలో దొరికారు

ఈ మధ్య కిడ్నాప్ వ్యవహారాలు కలకలం సృష్టిస్తున్నాయి. అయినవారిని కూడా నమ్మలేని పరిష్టితి ఏర్పడింది. డబ్బు కోసం తామేం చేస్తున్నామన్న విషయాన్నీ కూడా మరిచిపోతున్నారు కొందరు వ్యక్తులు. తాము చేస్తున్న తప్పా ఒప్పా అనేది కూడా గ్రహించలేక పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో కిడ్నాప్ కి గురైన డెంటిస్ట్ హుస్సేన్ ను పోలీసులు రక్షించారు.

హైదరాబాద్ నుంచి బెంగుళూరు తీసుకుంటుండగా అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. కాగా డా హుస్సేన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ అకాడమీ పక్కన కిస్మత్ పూర్ డెంటల్ క్లినిక్ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ఇద్దరు దుండగులు గన్ తో బెదిరించి కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకొని బెంగళూర్ పయనమయ్యారు.

కిడ్నాప్ విషయం రాజేంద్ర నగర్ పోలీసులకు తెలియడంతో.. కర్నూలు, అనంతపురం పోలీసులను అలెర్ట్ చేశారు. దింతో అనంతపురం ఎస్పీ జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు డాక్టర్ ను తీసుకెళ్తున్న కారును పట్టుకున్నారు. కాగా పోలీసులు ఆపడంతో కారును అక్కడ వదిలేసి ఇద్దరు దుండగులు పారిపోయారు.

డాక్టర్ కు వంటి నిండా గాయాలయ్యాయి. చేతులు కట్టేసి కారు మధ్యలో కూర్చోపెట్టారు దుండగులు.. నిస్సహాయ స్థితిలో పడిఉన్న డాక్టర్ ను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. దుండగులు డాక్టర్ పై దాడి చేసినట్లు తెలుస్తుంది. చేతినిండా రక్తపు మరకలు ఉన్నాయి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి