బిగ్ న్యూస్ :- చైనా అధీనం నుంచి 202 ఎకరాలు స్వాధీనం చేసుకున్న భారత్

బిగ్ న్యూస్ :- చైనా అధీనం నుంచి 202 ఎకరాలు స్వాధీనం చేసుకున్న భారత్

ఇండియన్ ఆర్మీ తీరుపై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రశంశలు కురిపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా బోర్డర్ కు సంబందించిన విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. అక్కడ భారత ఆర్మీ చూపుతున్న తెగువను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోల్పోయిన భూభాగాలను స్వాధీనం చేసుకుంటూ.. ఇవ్వని భారత్ లో అంతర్భాగమని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు..

ఈ ప్రాంతాలవైపు కన్నెతి చూసే దైర్యం చేయకండి అంటూ శత్రు దేశాలకు వార్నింగ్ ఇస్తుంది.. ఇక రక్షణ శాఖా సలహాదారు అజిత్ దోవల్ ఓ అడుగు ముందుకేసి భారత్ తో పెట్టుకుంటే ఏ దేశానికైన మక్కెలు ఇరుగుతాయి అనేలా వార్నింగ్ ఇచ్చి పడేశారు.. ఇక ఈ నేపథ్యంలోనే ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. దింతో ఆర్మీ సరిహద్దులో పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది..

భారత్ నుంచి ఆక్రమించిన భూభాగాలను స్వాధీనం చేసుకుంటుంది. సోమవారం చైనా ఆదీనంలో ఉన్న 202 ఎకరాల “స్ట్రాటజిక్ లాండ్” ను చైనా నుంచి స్వాధీనం చేసుకుంది భారత్.. కాగా 1986 లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ల్యాండ్ ను చైనా కబ్జా చేసింది. 34 ఏళ్ల తర్వాత స్వాధీనం చేసుకున్న ఈ ప్రాంతంలో 200 మంది భారత సైనికులను కాపలాగా పెట్టారు.

త్వరలో చైనా అధీనంలో ఉన్న మరికొన్ని ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇక సైనికులలో ధైర్యాన్ని నింపేందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బోర్డర్ లో పర్యటిస్తున్నారు. దసరా, ఆ తర్వాతి రోజు అయన సిక్కింలో పర్యటించి త్రిశక్తి సైన్యంతో సమావేశమయ్యారు. శత్రువును ఎదురుకునేందుకు ఎటువంటి టెక్నాలజీ కావాలన్నా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. వెనకడుగు వెయ్యొద్దని తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి