ఎల్వోసీ బీకర కాల్పులు
సరిహద్దుల్లో మరోసారి బుల్లెట్ల మోత మోగింది.. ఎల్ఓసి వద్ద బీఎస్ఎఫ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన బీఎస్ఎఫ్ జవాన్లు ఆయుధాలకు పనిచెప్పారు. బీకర కాల్పులు జరిపారు.. ముగ్గురు టెర్రరిస్టులను పైకి పంపారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు విడిచారు.
మరో ఇద్దరు గాయపడ్డారు. మచిల్ సెక్టార్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చొరబాట్లను అడ్డుకునేందుకు జవాన్లు సరిహద్దుల్లో నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న సమాచారం తెలుసుకొని సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు కాల్పులు జరిగాయి.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి