RT-PCR టెస్టుల్లోనూ బయపడని ఇండియన్ కరోనా వేరియంట్ -నెగెటివ్ వచ్చినా కరోనా లేదని కాదు..

RT-PCR టెస్టుల్లోనూ బయపడని ఇండియన్ కరోనా వేరియంట్ -నెగెటివ్ వచ్చినా కరోనా లేదని కాదు..

రోనా కొత్త వేరియంట్.. భారతీయులను భయపెడుతుంది. ర్యాపిడ్ టెస్ట్,RT-PCR టెస్టుల్లో కరోనా లక్షణాలు బయటపడటం లేదని డాక్టర్లు చెబుతున్నారు. పరీక్షల్లో బయటపడిన వారు.. లక్షణాలు ఉంటే కచ్చితంగా లంగ్, చెస్ట్ ఎక్స్ రే తీయించుకోవాలని సూచిస్తున్నారు. దాంట్లోనే బయటపడుతుందని.. లంగ్ ఇన్ఫక్షన్ ద్వారా కరోనా అని నిర్థారించాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.

ఈ పరిణామాలతో టెస్టుల్లోని లోపాలను ఎత్తిచూపిస్తున్నారు. దేశంలో కరోనా మరణాలు అధికంగా నమోదు కావటం ఇదే కారణం అని చెబుతున్నారు వైద్యులు. ఏప్రిల్ 18వ తేదీ ఒక్క రోజే దేశంలో అధికారికంగా 16 వందల మంది చనిపోయారు. దీనికి కారణం.. కరోనాను ఆలస్యంగా గుర్తించటం.. ఆరు పాయింట్లు దాటిని తర్వాత ఆస్పత్రికి రావటం వల్లే ఈ దుస్థితి అని నిర్థారణ అయ్యింది.

కరోనాను గుర్తించటానికి ఇప్పటి వరకు ర్యాపిడ్ టెస్ట్ లేదా RT-PCR పరీక్షలే ప్రామాణికంగా ఉంది దేశంలో. ఇక నుంచి పరీక్షల విధానంలోనూ మార్పులు రావాలని చెబుతున్నారు. లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. రెండు వైరస్ లు కలిపి ఉంటున్నాయని.. ఆస్పత్రికి వచ్చిన వారిలో 50 శాతం మందికి ఆక్సిజన్ అత్యవసరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

మొదటి దశలో కరోనా చికిత్సలో ఆక్సిజన్ స్థాయికి వెళ్లిన శాతం కేవలం 15 శాతంగా ఉంటే.. ఇప్పుడు అది 50 శాతానికి పెరిగిందని.. ఇది చాలా చాలా ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు. కరోనా పరీక్షల్లోనూ లక్షణాలు నిర్థారణ కాకపోవటం వల్ల.. కరోనా లేదనే ఉద్దేశంతో బయటప స్వేచ్ఛగా తిరిగేస్తున్నారని.. ఇక నుంచి ఎక్స్ రేతోపాటు ఇన్ఫెక్షన్ పరీక్షలు చేయించుకోవాల్సి అవసరం ఏర్పడుతుందని చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు