IPL వాయిదా.. ఆటగాళ్లకు కరోనా రావటంతో నిలిపివేత..

IPL వాయిదా.. ఆటగాళ్లకు కరోనా రావటంతో నిలిపివేత..

IPL 2021 suspended
IPL 2021 suspended

IPL వాయిదా.. ఆటగాళ్లకు కరోనా రావటంతో నిలిపివేత..

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. IPL క్రికెట్ మ్యాచ్ లను అర్థాంతరంగా.. నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. రెండు రోజులుగా పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథన్, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, టీమ్‌ బస్సు డ్రైవర్‌ కరోనా పాజిటివ్‌గా తేలారు. తర్వాత సీఈవో కాశీ విశ్వనాథన్‌కు నెగెటివ్‌ రాగా… మిగతా ఇద్దరు పాజిటివ్‌ అని తేలింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే మే 3వ తేదీ జరగాల్సిన బెంగళూరు – కోల్ కతా మ్యాచ్ రద్దు అయ్యింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన ఆటగాళ్లు అందరూ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

బబూల్ లో ఉన్న ఐపీఎల్ జట్టు సైతం.. కరోనా బారిన ఎలా పడ్డారు అనేది షాకింగ్ గా ఉంది. నిరంతరం పరీక్షలు చేయటంతోపాటు.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ ఆటగాళ్లు ప్రత్యేక రక్షణ వలయంలో జీవిస్తున్నారు. రోజూ పరీక్షలు నిర్వహించటంతోపాటు.. వారికి సేవలు అందించే అందరూ ఓ రకంగా క్వారంటైన్ లో ఉండి మరీ సేవలు చేస్తున్నారు. ఇంత కట్టుదిట్టమైన బబూల్ ఉండి కూడా కరోనా బారిన పడటంతో.. ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు తలెత్తాయి.

ఈ క్రమంలోనే ఐపీఎల్ 2021 సీజిన్ ను అర్థాంతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు శుక్లా ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. రెండు రోజులుగా పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని.. 8 ఫ్రాంజైసీస్ ఆటగాళ్లు ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని.. అందుకే మ్యాచులు అన్నీ రద్దు చేయటం జరిగిందన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు