లే నాన్న లే.. అన్నం తెచ్చాను తిను నాన్న – రెండు రోజులుగా తండ్రి సమాధి దగ్గరే కూతురు – ఊరంతా కన్నీరు

ఇంకా ఎన్నాళ్లు ఇలా గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తావు అంటూ ఇంట్లోని వారు, బంధువులు

ఆ తండ్రి ఇంక ఎప్పటికీ రాడు.. ఈ లోకంలోనే లేడు.. ఆ కూతురికి మాత్రం నాన్నే కావాలి.. తిరిగిరాడు అని ఎంత మంది చెప్పినా వినటం లేదు.. ఎంత మంది ఓదార్చిన వినటం లేదు.. రెండు రోజులుగా తండ్రి సమాధి దగ్గరే ఉండి.. కంటికి ధారగా ఏడుస్తూనే ఉంది.. ఈ ఘటన చూసిన ఊరంతా కన్నీటి పర్యంతం అవుతుంది.. ఆ చిన్నారిని ఓదార్చటం ఎవరి తరం కావటం లేదు.. వింటేనే కాదు.. ఫొటో చూసిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతోంది.. అయ్యో పాపం అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లాలో కొండగట్టు బస్సు ప్రమాదం జరిగింది. ఇది జరిగి రెండేళ్లు అయ్యింది. అయినా ఆ చిన్నారి తండ్రి జ్ణాపకాల నుంచి బయటపడలేదు. తండ్రి చనిపోయిన రోజు వచ్చింది. అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తండ్రి సమాధి దగ్గరకు వెళ్లింది. లే నాన్నా లే.. నీ ముద్దుల కూతురిని వచ్చాను.. అన్నం తెచ్చాను తిను నాన్న.. లే నాన్న లే అంటూ ఒకటే ఏడుస్తుంది. రెండు రోజులుగా సమాధి దగ్గరే ఉంటుంది. తిండీతిప్పలు లేవు. తొమ్మిదేళ్ల చిన్నారిని ఓదార్చటం ఎవరి వల్లా కావటం లేదు..

మీ నాన్న ఇక రాడమ్మా.. మర్చిపో.. ఇప్పటికే రెండేళ్లు అయ్యింది.. ఇంకా ఎన్నాళ్లు ఇలా గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తావు అంటూ ఇంట్లోని వారు, బంధువులు, చుట్టాలు, ఊరి జనం చెప్పినా కూడా వినటం లేదు. రెండు రోజులుగా సమాధి దగ్గరకు వెళ్లటం రాత్రి వరకు అక్కడే ఉండటం చేస్తోంది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నాన్న అన్నం తీసుకెళుతుంది కూడా ఆ ముద్దుల కూతురు.

కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోయారు. ఆ యాక్సిడెంట్ లోనే.. జగిత్యాల జిల్లా కొడిమ్యల మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన ద్యాగాల స్వామి కూడా చనిపోయాడు. ఇంటి యజమానిని కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పటికీ కోలుకోలేదు అనటానికి ఈ చిన్నారి వేదనే చెబుతోంది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి