వైసీపీ వాళ్ళు నన్ను 50 కోట్లు అడిగారు – జేసీ దివాకర్ రెడ్డి

వైసీపీ వాళ్ళు నన్ను 50 కోట్లు అడిగారు – జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి సోమవారం తెలుగు న్యూస్ ఛానల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత సోనియా గాంధీతో కాంగ్రెస్ ను ఆరడుగుల గొయ్యి తీసి బొందబెట్టాలని చెప్పానని అన్నారు. ఆ తర్వాత తాను రాజీనామా చేసిన విషయం తెలుసుకొని వైసీపీ నేత విజయసాయిరెడ్డి, మరో వ్యక్తి తనవద్దకు వచ్చినట్లు జేసీ వివరించారు.. ఈ సమయంలో వారు తనను 50 కోట్లు డిమాండ్ చేశారని చెప్పుకొచ్చారు.

ఆలా డబ్బు అడిగినందువల్లే తాను ఆ పార్టీలోకి వెళ్లలేదని తెలిపారు. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉందని. డబ్బు పెట్టి టికెట్ కొనుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు జేసీ. అదే డబ్బు ఎన్నికల్లో ఖర్చు చేయమని చెప్పి ఉంటె హ్యాపీగా చేసేవాడినని, కానీ వారు ఆలా కాకుండా టికెట్ కోసమే, లేదంటే మరో విధంగానో అడిగారని తెలిపారు..

కాగా గత కొద్దీ రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.. జేసీ సోదరుడు, సోదరుడి కుమారుడు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అనంతరం మరో కేసు నమోదైంది.. ఇక తాజాగా రెండు రోజుల క్రితం కూడా జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది.

మైనింగ్ క్వారీల్లో మైనింగ్ ఆపాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు అధికారులు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ఎందుకో తమ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు