జెఈఈ మెయిన్స్ లో తెలుగు విద్యార్థుల ప్రతిభ

ఈ నెల మొదటివారంలో నిర్వహించిన జెఈఈ మెయిన్స్ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. పర్సెంటైలో జాతీయ స్థాయిలో పోటీ పడ్డారు తెలుగు విద్యార్థులు. మొత్తం 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ కు అర్హత సాధించారు. వీరిలో 12 వేలమంది తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం..

వీరిలో తెలంగాణ నుంచి 6 వేల మంది, ఏపీ నుంచి 6 వేల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. దేశవ్యాప్తంగా 100 పర్సైంటైల్ సాధించిన విద్యార్థులు 24 మంది ఉండగా…వారిలో తెలంగాణకు చెందినవారు 8 మంది ఉన్నారు. ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి అరవింద్ నరసింహ, కౌశల్ కుమార్ రెడ్డి, చుక్కా తనూజ, సాగి శివకృష్ణ, యశ్ స చంద్ర, లిఖిత్ రెడ్డి, శశాంక్ అనిరుధ్, అరుణ్ సిద్ధార్థ 100 పర్సైంటైల్ సాధించగా ఏపీ విద్యార్థులు లండ జితేంద్ర, తడవర్తి విష్ణు శ్రీ సాయి శంకర్, వైఎస్ఎస్ నరసింహనాయుడు 100 పర్సైంటైల్ సాధించి ప్రతిభ చూపించారు.

ఈ ఏడాది రెండు సార్లు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు, జనవరిలో ఓ సారి నిర్వహించగా, తిరిగి సెప్టెంబర్ 2 నుంచి 6 దాకా జెఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. రెండు విడతల్లో పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు ఏ విడతలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే నమోదు చేయనున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి