కొత్త జీవితాన్ని ప్రారంభించిన కాజల్

కొత్త జీవితాన్ని ప్రారంభించిన కాజల్

కాజల్ అగర్వాల్ తెలుగులో మంచి క్రెజ్ ఉన్న హీరోయిన్, లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరిని మెప్పించింది, ఆ తర్వాత పౌరుడు, ఆటాడిస్తా సినిమాల్లో నటించారు. ఇక 2009లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు కాజల్.

మిత్రవింద పేరుతొ ప్రజల నోళ్ళలో నానిపోయారు. కాగా శుక్రవారం అమ్మడు పెళ్లిపీఠలు ఎక్కారు. ముంబైలోని ఓ హోటల్ లో కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్ది మంది ఆప్తుల మధ్య చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడిచారు. కాగా వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి. కాజల్ – గౌతమ్ జంటగా ఉన్న ఫొటోలు చూసిన అభిమానులు..

మేడ్ ఫర్ ఈజ్ అదర్ అంటున్నారు. జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళిలో గౌతమ్‌ కిచ్లు ఆఫ్-వైట్ అండ్‌ సిల్వర్ కలర్‌ షెర్వానీని ధరించగా, కాజల్ అగర్వాల్ ఎరుపు రంగు లెహంగా ధరించింది. హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి వేడుక జరిగింది. ఇక ఇప్పటికే ముంబైలో వీరు ఇల్లు సిద్ధం చేసుకున్నారు. త్వరలో ఆ ఇంట్లోకి వెళ్లనున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి