మహేశ్ భట్ తో కంగన.. రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందిన నాటినుంచి బాలీవుడ్ లో ఉన్న లొసుగులు ఒక్కక్కటిగా బయటపడుతున్నాయి. ఇక సుశాంత్ మృతికి బాలీవుడ్ పెద్దలే కారణమంటూ కంగనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆమె బాలీవుడ్ తో పాటు శివసేన పార్టీని కూడా టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేసింది.. ముంబై నగరాన్ని పీఓకే గా పోల్చింది. అయితే ఆమె మాటలపై శివసేన మండిపడింది.

ఇది ఇలా ఉంటే మహేష్ భట్ తో కంగనా కూర్చుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన రాఖీ సావంత్ సంచల వ్యాఖ్యలు చేసింది సుశాంత్ కే కేస్ మే నయా మోడ్ ఆయా” (సుశాంత్ కేసులో కొత్త కోణం వచ్చింది ) అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే కంగనా అభిమానులు మాత్రం ఆ ఫోటో మార్పింగ్ అని అంటున్నారు. కావాలనే కంగనాపై విమర్శలు చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. కేసులు పక్కదారి పట్టించేందుకు శివసేన, మరికొందరు బాలీవుడ్ నటులు కుయుక్తులు పన్నుతున్నారని సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి