ఖమ్మం జిల్లాలో దారుణం.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పు

ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. కళ్ళు నెత్తికెక్కిన ఓ మృగం పసిపాపపై కన్నేసి అత్యాచారానికి యత్నించాడు. బాలిక తిరగబడటంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.. ఈ దారుణ ఘటన ఖమ్మం పట్టణంలోని ముస్తఫా నగర్ లో చోటుచేసుకుంది. ఉదయం ఇంటి పనిచేసిన 13 ఏళ్ల బాలికను బలాత్కారం చేసేందుకు ప్రయత్నించాడు ఇంటి యజమాని కొడుకు.. ఆమె ప్రతిఘటించడంతో వంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు..

ఈ దారుణ ఘటనలో బాలిక 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన బాధితురాలు, తనను చేయి పట్టి లగాడని తెలిపింది.. తాను ప్రతిఘటించడంతో తనపై పెట్రోల్ పోసినట్లు తెలిసింది.. బాలిక పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు చుట్టుపక్కలవారు.. బాలిక ఆర్తనాదాలు అందరిని కదిలిస్తున్నాయి.. కాగా ప్రస్తుతం ఇంటి యజమాని కొడుకు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి